MS Dhoni : న‌య‌న‌తార క‌థానాయిక‌గా ఎంఎస్ ధోని సినిమా..!

Authored By Sam C | The Telugu News | Published on: May 13, 2022, 5:30 pm

MS Dhoni : భార‌తీయ క్రికెట్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నాడు ధోని.అంత‌ర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన ధోని ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో చెన్నై కింగ్స్ టీమ్‌ను ఆయ‌న లీడ్ చేస్తున్నారు. క్రికెట్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లోనూ ధోని హ‌వా కొన‌సాగుతోంది. వీటితో పాటు ధోని మ‌రో రంగంలోనికి అడుగు పెట్ట‌బోతున్నార‌నే వార్త‌లు సినీ రంగంలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇన్నాళ్లూ క్రికెట్ బ్యాట్ ప‌ట్టి ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌కు చుక్కులు చూపించిన మ‌న ధోని.. వికెట్ కీప‌ర్‌గా అద్భుతంగా రాణించిన మ‌న క్రికెట్ వీరుడు సిల్వ‌ర్ స్క్రీన్‌పై డాన్సులు, ఫైట్స్ చేస్తారా అనే సందేహం క‌లుగక‌మాన‌దు.

అయితే ధోని ఇప్పుడు నిర్మాత‌గా సందడి చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.ధోని నిర్మించనున్న తొలి తమిళ చిత్రంలో నయనతార ప్రధాన పాత్రలో నటిస్తుందని సమాచారం. సూపర్ స్టార్ రజనీకాంత్‌ సన్నిహితుడు సంజయ్‌తో పాటు నయనతార నటించనుందని సమాచారం. ధోనీ తొలి చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోందని… ప్రస్తుత ఐపీఎల్ సీజన్ తర్వాత దీనిపై అధికారికంగా ప్రకటన రావచ్చని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ నెలలోనే.. అంటే ఐపీఎల్ ముగిసిన వెంటనే.. సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. అంటే ఈ లెక్క.. ఎంఎస్ ధోనీ తమిళ చిత్ర సీమలో పనిచేయబోతున్నాడు. క్రికెట్ తర్వాత.. తన సినిమాలతో తమిళ అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకోబోతున్నాడు.

MS Dhoni movie with Nayanathara

MS Dhoni movie with Nayanathara

MS Dhoni : ధోని విత్ న‌య‌న్..

ఈ సీజన్ తర్వాత ధోనీ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పేసి.. సినిమాలపై పూర్తిగా దృష్టిసారిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక త్వరలోనే విఘ్నేశ్ శివన్-నయనతారలు తమ సుదీర్ఘ ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పెట్టేసి.. పెళ్లి బంధంతో ఒక్కటయ్యేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు నయన్ కూడా.. ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీగా ఉంది. అందులో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో అట్లీ దర్శకత్వంలో సెట్స్‌పై ఉంది. ఒక‌వేళ ఇప్పుడు వ‌చ్చేవార్త‌లు నిజ‌మైతే న‌య‌న‌తార సినిమా ప్ర‌మోష‌న్స్‌కు హాజ‌రు కాన‌నే కండీష‌న్ పెట్టే సినిమాలో యాక్ట్ చేయ‌డానికి ఓకే చెబుతుంది. మ‌రి ధోని సినిమాకు కూడా అలాంటి కండీష‌నే పెట్టిందా! అని చూడాలి.

Sam C

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp