Ananya Panday : అనన్యా పాండే చెంపలు కొరికేసిన మైక్ టైసన్.. బాక్సింగ్ లెజెండ్‌తో ‘లైగర్’ టీమ్..
Ananya Panday : రౌడీ హీరో విజయ్ దేవరకొండ త్వరలో పాన్ ఇండియా స్టార్ కాబోతున్నాడు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో ‘లైగర్’ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు విజయ్. ఈ చిత్రం ద్వారా బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌ను వెండితెరకు పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రంలో మైక్ టైసన్‌తో విజయ్ తలపడనున్నాడు.
మైక్ టైసన్‌తో సినిమాలోని సన్నివేశాల చిత్రీకరణ కోసం ప్రజెంట్ ‘లైగర్’ మూవీ యూనిట్ సభ్యులు అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లారు. అక్కడ సినిమాను షూట్ చేస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ అనన్యా పాండే నటిస్తోంది.
myke tyson kss to Ananya Panday
Ananya Panday : ఆన్ లొకేషన్ పిక్స్ వైరల్..
ఇకపోతే ఆన్ లొకేషన్ సెట్స్‌లో పూరీ జగన్నాథ్, అనన్యా పాండే, చార్మీ కౌర్, విజయ్ దేవరకొండ మైక్ టైసన్‌తో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రజెంట్ బాగా వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో ఒక దాంట్లో మైక్ టైసన్ అనన్యా పాండే చెంపల దగ్గర అరుస్తూ ఆమె చెంపలను కొరికేస్తున్నట్లుగానే స్టిల్ ఇచ్చాడు. నెట్టింట ఈ ఫొటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అమెరికాలోని వేగాస్‌లో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
‘లైగర్’ ఫిల్మ్‌ను పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా ప్రొడ్యూస్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ త్వరలో వచ్చే చాన్సెస్ ఉన్నాయి. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌ను సిల్వర్ స్క్రీన్‌పైన చూసేందుకుగాను సినీ ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.