Home » Entertainment » Mythri Movies About Vijay Devarakonda Hero Movie
Entertainment

Mythri movies : అందుకే ఆ సినిమా ఆపేశాం.. విజయ్ దేవరకొండ ‘హీరో’పై ‘మైత్రీ’ మూవీ క్లారిటీ

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: February 11, 2021, 8:56 am
Advertisement

Mythri movies : మైత్రీ మూవీస్ అనే బ్యానర్‌కే ఓ బ్రాండ్ నేమ్ ఉంది. వారు నిర్మిస్తోన్న చిత్రమంటే అది కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అని అందరికీ ఓ నమ్మకం ఉంది. మొదటి సారిగా వారి నమ్మకం చెల్లా చెదురైంది.ఎంతో నమ్మకం పెట్టుకున్న డియర్ కామ్రేడ్ సినిమా తుస్సుమంది. దక్షిణాది మొత్తంలో గ్రాండ్‌గా రిలీజ్ చేసిన డియర్ కామ్రేడ్ దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది. ఆ ఒక్క చిత్రంతో మైత్రీ వారికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే మళ్లీ విజయ్ దేవరకొండతో మరో చిత్రాన్ని ప్లాన్ చేశారు.

Advertisement

Mythri movies about Vijay devarakonda Hero movie

Mythri movies : విజయ్ దేవరకొండ ‘హీరో’పై ‘మైత్రీ’ మూవీ క్లారిటీ..

ఆ మధ్య గ్రాండ్‌గా ప్రారంభించేశారు కూడా. విజయ్ దేవరకొండను నిజంగానే ‘హీరో’గా చూపించేందుకు మైత్రీ మూవీస్ సిద్దమైంది. హీరో టైటిల్‌ విజయ్‌కు బాగానే సూట్ అయిందని అందరూ అనుకున్నారు. అయితే అది రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. ఫార్మూలా, బైక్ రేసింగ్‌ల నేపథ్యంలో తెరకెక్కించాలన్నప్పుడు ఏదో పర్మిషన్ రాదని చెబుతూ త్వరత్వరగా ప్రారంభించాల్సి వచ్చింది. అలా కొంత షూట్ చేశామని చెప్పుకొచ్చారు.

Advertisement

కానీ పూర్తి కథను మాత్రం తయారు చేయలేకపోయాడు ఆ దర్శకుడు.. అందుకే ఎంతకీ సినిమా ముందుకు వెళ్లడం లేదని క్యాన్సిల్ చేశాం. అయితే విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ కాంబోను సెట్ చేశాం. టక్ జగదీశ్ అయ్యాక విజయ్ దేవరకొండతో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నామని మైత్రీ వారు క్లియర్‌గా చెప్పేశారు. మొత్తానికి మైత్రీ వారికి విజయ్ దేవరకొండతో అంత కలిసిరానట్టుగా ఉంది. మొదటి సినిమా డిజాస్టర్ అయితే రెండో సినిమా మధ్యలోనే ఆగిపోయింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి