Revanth reddy
Revanth reddy : కాంగ్రెస్ పార్టీలో సీనిరయర్ లు జూనియర్‌లు అంటూ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. పార్టీలో అడుగు పెట్టిన జూనియర్ లను సీనియర్ లు తొక్కేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ కారణంగానే ఎన్నో సార్లు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు వచ్చి పార్టీ నుండి విడిపోయిన వారు ఉన్నారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కాకుండా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ లో ఇదే పద్దతి కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే సీనియర్ ల పార్టీ అనే చర్చ కూడా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఈమద్య కాలంలో కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి వెళ్లాడు. ఆయన రాకను అందరు స్వాగతించినా కూడా పార్టీలో ఆయనకు ప్రాముఖ్యత ఇస్తామంటే మాత్రం వీహెచ్ వంటి సీనియర్ లు నో అంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి పార్టీ పరంగా ఏం చేయాలన్నా కూడా వెనక్కు లాగే ప్రయత్నాలు చేస్తున్నారు.
Revanth reddy situation in telangana congress party
గతంలో రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇలా అందరు పాదయాత్రలు చేసి సీఎం పీఠంపై కూర్చున్నారు. అందుకే తాను కూడా సీఎం పీఠంపై కూర్చునే విషయం పక్కన పెడితే పార్టీని కనీసం బతికించుకునేందుకు పాద యాత్ర చేస్తానంటూ రేవంత్ రెడ్డి అధిష్టానం వద్ద పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నాడు. అయినా కూడా అధినాయకత్వం ఆయనకు ఓకే చెప్పడం లేదు. కారణం పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. సొంత ఇమేజ్ ఫామ్ అయితే పార్టీకి నష్టం అంటూ సీనియర్ లు అధినాయకత్వంకు నూరి పోస్తున్నట్లుగా గుస గుసలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ ఛీప్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకుంటే బాగుంటుందని ఆ పార్టీ నాయకులతో పాటు చాలా మంది బలంగా కోరుకుంటున్నారు. కాని పార్టీ సీనియర్ లు మాత్రం రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ అవ్వనిచ్చేది లేదు అంటున్నారు. నిన్నకాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే మేం ఏం చేయాలంటూ సీనియర్ లు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి పార్టీ బలోపేతంకు ఏం చేయలేక పోతున్నాడు అంటూ స్వయంగా ఆపార్టీకి చెందిన కొందరు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లు జూనియర్ లు అనే కుమ్ములాటలు ఉన్నంత కాలం ఆ పార్టీ పూర్వ వైభవంను దక్కించుకోవడం అసాధ్యం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
This website uses cookies.