Naa Anveshana Anvesh బ్రేకింగ్ : సుప్రీం కోర్టు బోనులో నా అన్వేషణ అన్వేష్
ప్రధానాంశాలు:
Naa Anveshana Anvesh బ్రేకింగ్ : సుప్రీం కోర్టు బోనులో నా అన్వేషణ అన్వేష్
Naa Anveshana Anvesh: సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న మన ‘నా అన్వేషణ’ అన్వేష్‌కు మెటా కంపెనీ గట్టి షాకే ఇచ్చింది. రకరకాల వివాదాస్పద వ్యాఖ్యలు, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్ట్లు పెట్టారనే ఆరోపణలతో అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా శాశ్వతంగా డిలీట్ చేసేసింది. ఒకప్పుడు 18 మిలియన్ల ఫాలోవర్లతో ఒక వెలుగు వెలిగిన అన్వేష్, ఈ మధ్య జరిగిన గొడవలతో 1.3 మిలియన్లకు పడిపోయారు. ఇప్పుడు ఏకంగా ఆ అకౌంటే గాల్లో కలిసిపోవడంతో నెట్టింట పెద్ద రచ్చే జరుగుతోంది. హిందూ దేవుళ్లను కించపరిచారంటూ హైదరాబాద్‌లోని పంజాగుట్ట, సైబర్ క్రైమ్ స్టేషన్లలో కేసులు కూడా ఫైల్ అయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి చెక్ చేయడంతో, రూల్స్ బ్రేక్ అయ్యాయని తేల్చిన మెటా.. అన్వేష్ అకౌంట్‌పై వేటు వేసింది.
Naa Anveshana Anvesh బ్రేకింగ్ : సుప్రీం కోర్టు బోనులో నా అన్వేషణ అన్వేష్
అయితే అకౌంట్ పోయినా అన్వేష్ ఏమాత్రం తగ్గేదేలే అంటున్నారు. దీనిపై ఆయన రియాక్ట్ అవుతూ.. “నాకు రెండు ఇన్‌స్టా అకౌంట్లు, రెండు యూట్యూబ్ ఛానెళ్లు ఉన్నాయి. అవన్నీ నా కాళ్లు, చేతులు లాంటివి. ఇప్పుడు ఒక చేయి పోతే ఏమైంది? ఇంకా కాళ్లు ఉన్నాయి, అవి పోయినా నా శరీరం ఉంది, అది కూడా పోయినా నా నోరు ఉంది.. అదే నాకు చాలు” అంటూ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. కేవలం ఇన్‌స్టాగ్రామ్ మీద తాను డిపెండ్ అవ్వలేదని, ఒక్క యూట్యూబ్ ద్వారానే తనకు నెలకు 8 లక్షల దాకా వస్తాయని, తన రేంజ్ వేరని చెప్పుకొచ్చారు. అంతేకాదు, 2026లో తనను టార్గెట్ చేస్తున్న ‘బత్తాయిలకు’ నరకం చూపిస్తానని వార్నింగ్ కూడా ఇచ్చారు.
అన్వేష్ ఇప్పుడు ఏకంగా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధమయ్యారనేది ఇక్కడ అసలు మ్యాటర్. తన అకౌంట్‌ను అన్యాయంగా డిలీట్ చేశారని, తన భావప్రకటనా స్వేచ్ఛను హరించారని ఆయన సుప్రీంకోర్టులో పోరాడాలని ఫిక్స్ అయ్యారు. మెటా లాంటి పెద్ద కంపెనీలతో పెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు, కానీ అన్వేష్ మాత్రం వెనక్కి తగ్గకుండా సుప్రీంకోర్టు దాకా వెళ్లాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన అకౌంట్ తిరిగి తెచ్చుకోవడానికి, తనపై ఉన్న కేసుల విషయంలో క్లారిటీ తెచ్చుకోవడానికి ఆయన తీసుకున్న ఈ స్టెప్ ఇప్పుడు పెద్ద సెన్సేషన్ అవుతోంది.