Nabha Natesh : నడి రోడ్డులో బొంగరం తిప్పిన భామ.. నభా అందాల విందు

Authored By Cinema Desk | The Telugu News | Published on: August 10, 2021, 8:00 pm

Nabha Natesh : నభా నటేష్ అందాల విందు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. భారీ అందాలను ప్రదర్శించడంలో నభా తరువాతే ఎవ్వరైనా. ఈ కన్నడ భామ తెలుగులో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. సినిమాలు హిట్టైనా, ఫ్లాపైనా కూడా నభాకు మాత్రం మంచి పేరు వస్తోంది. నన్ను దోచుకుందువటే అంతగా హిట్ అవ్వలేదు. కానీ మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇస్మార్ట్ శంకర్ మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. దీంతో స్టార్ హీరోయిన్‌ల జాబితాలో చేరింది.

Nabha Natesh Funny Video

Nabha Natesh Funny Video

అలా నభాకు ఆఫర్లు వెల్లువెత్తాయి. సోలో బ్రతుకే సో బెటర్ హిట్ కాగా.. అల్లుడు అదుర్స్ బోల్తా కొట్టింది. అయినా నభాకు మాత్రం సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. హాట్ హాట్ ఫోటో షూట్లు, అందాల ప్రదర్శనకు తెరదీసే ఫోటోలను షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా నభా నటేష్ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె అందాలు బయటపడ్డాయి. నడి రోడ్డు మీద బొంగరం తిప్పుతూ రచ్చ చేసింది.

నడి రోడ్డులో బొంగరం తిప్పిన భామ.. నభా అందాల విందు

ఏదో ఒక సినిమా షూటింగ్ గ్యాప్‌లో ఇలా అల్లరి చేసినట్టుంది. బొంగరం తిప్పేందుకు ప్రయత్నించింది. మొదటిసారి బొంగరం వేయగా అది తిరగలేదు. రెండో ప్రయత్నంలో నభా సక్సెస్ అయింది. ఇక లంగావోణిలో నభా అందాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. నభా అల్లరికి అందరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం నభా నటేష్.. నితిన్ హీరోగా వస్తోన్న అంధాదున్ రీమేక్ మాస్ట్రోలో హీరోయిన్‌గా నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Nabha Natesh (@nabhanatesh)

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp