Nabha natesh : నభా నటేష్ ని చూస్తే నిద్ర రావడం లేదట..!

0
Advertisement

Nabha natesh : నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత టాలీవుడ్‌లో వరసగా సినిమాలు చేస్తూ వస్తోంది. అంతక ముందు చేసిన నన్నుదోచుకుందువటే, అదుగో సినిమాలలో డీసెంట్ రోల్స్ చేసింది. కానీ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌లో మాత్రం నభా అందాల ఆరబోత అదిరిపోయింది. ఇస్మార్ట్ బ్యూటీగా ఈ సినిమా తర్వాత ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత కూడా నభా ఎక్కువగా గ్లామర్ రోల్స్ ఎంచుకుంటోంది.

nabha natesh latest glamour photos
nabha natesh latest glamour photos

సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా ఖాళీ లేకుండా నభా అవకాశాలు అందుకుంటోంది. గత ఏడాది చివర్లో మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేసి హిట్ అందుకుంది. ఇదే సక్సస్ కంటున్యూ చేస్తుందనుకుంటే ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన అల్లుడు అదుర్స్ సినిమా నభాకి ఫ్లాప్ ఇచ్చింది. పర్ఫార్మెన్స్ పరంగా నభా నటేష్ బాగా చేసినప్పటికి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సత్తా చాట లేకపోయింది. అయినా నభా కెరీర్‌కి ఎలాంటి ఢోకా లేదు.

Nabha natesh : నభా నటేష్ ఇటు అభిమానులను అటు మేకర్స్‌ను తనవైపు తిప్పుకుంటోంది.

ప్రస్తుతం తన చేతిలో యూత్‌స్టార్ నితిన్ నటిస్తున్న బాలీవుడ్ హిట్ సినిమా అంధాదున్ తెలుగు రీమేక్ చేతిలో ఉంది. ఈ సినిమాలో నభా గ్లామర్ ట్రీట్ బాగానే ఇవ్వబోతోందట. ఇదిలా ఉంటే నభా ఎప్పటికప్పుడు లేటెస్ట్ హాట్ అండ్ స్పైసీ ఫొటోస్‌తో అభిమానులకు సెగలు పెట్టిస్తోంది. తాజాగా అలాంటి లేటెస్ట్ స్పైసీ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోస్ అభిమానులు షేర్ చేసుకోవడమే కాదు.. నెటిజన్స్ కాస్త హాట్ కామెంట్స్ కూడా చేస్తున్నారట. మొత్తానికి నభా నటేష్ ఇటు అభిమానులను అటు మేకర్స్‌ను తనవైపు తిప్పుకుంటోంది.

Advertisement