Nadhiya rejects maheshBabu movie
Nadhiya : నదియా.. ఈవిడ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు సీనియర్ హీరోయిన్‌గా అదరగొట్టిన నదియా ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తుంది. అత్తారింటికి దారేది సినిమాలో పవన్‌కు పోటీ పడి మరీ అత్త పాత్రలో నటించిన నదియాకు ఆ సినిమా నుండి టాలీవుడ్‌లో మరింత క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం నదియా పలు చిత్రాల్లో నటిస్తూ.. బిజీగా గడుపుతోంది. ఈ నేపధ్యంలో మహేశ్ బాబు-మురుగదాస్ సినిమా స్పైడర్‌లో కూడా ఓ పాత్రలో నటించే అవకాశం వచ్చిందట. మహేష్ తల్లి పాత్రలో మొదట నదియా ని అనుకున్నారట.కానీ ఆమె ఈ పాత్రకు నో చెప్పిందట. నిజానికి స్పైడర్ సినిమాలో మహేష్ అమ్మ క్యారెక్టర్ పెద్ద గా ఏం ఉండదు..
అందుకే నదియా ఈ సినిమాను వదులుకుందట. దీంతో మహేష్ తో నటించే అవకాశాని మిస్ చేసుకుంది ఈ సీనియర్ హీరోయిన్. ప్రస్తుతం నదియా చాలా మంది సీనియర్ హీరోలకు కూడా తల్లిగా, వదినగా, అక్కగా నటిస్తుంది. పెళ్లి తర్వాత మిర్చి సినిమాతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చిన నదియా.. అత్తారింటికి దారేది సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు సెలక్టివ్‌గా పాత్రలను ఎంచుకుంటూ ముందుకువెళ్తున్నారు.మొదటిసారిగా 1984లో మలయాళ సినిమాలో మోహన్‌లాల్ సరసన నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా తమిళ్, తెలుగు, మలయాళ చిత్రాలలో నటించింది. అప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించే అవకాశం నదియాకి ఓ సారి వచ్చింది.
Nadhiya rejects maheshBabu movie
కాని జస్ట్ మిస్ చేసుకుందట. ఇప్పుడు చిరంజీవి సినిమాలలో నదియాని సపోర్టింగ్ రోల్‌కి సంప్రదిస్తున్నట్టు సమాచారం. నదియా ఇప్పటికీ కుర్ర హీరోయిన్స్‌కి పోటీ ఇచ్చేలా తన అందంతో అలరిస్తుంది.కాగా, నదియా స్టార్ హీరోలందరితోను నటించింది. మంచి ఫామ్ లో ఉన్నసమయంలోనే 1988లో బిజినెస్ మ్యాన్ శిరీష్ గాడ్ బోల్‌ను వివాహం చేసుకున్నారు. అనంతరం నదియా శిరీష్ దంపతులు అమెరికన్ లోనే సెటిల్ అయ్యారు. ఈ దంపతులకు 1996 లో ఆడపిల్ల పుట్టింది. ఆమె పేరు సనమ్.. అనంతరం మళ్ళీ ఐదేళ్ల తర్వాత రెండో అమ్మాయి జానా కు జన్మనిచ్చింది నదియా.. ఇద్దరు కూతుళ్లు తల్లి అయినా ఇప్పటికీ నదియా అందంకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
This website uses cookies.