Nadhiya : అంతా బాగుండి ఉంటే, ఆ సీనియ‌ర్ హీరోయిన్ మహేశ్ ‌బాబుకి త‌ల్లి అయి ఉండేది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nadhiya : అంతా బాగుండి ఉంటే, ఆ సీనియ‌ర్ హీరోయిన్ మహేశ్ ‌బాబుకి త‌ల్లి అయి ఉండేది..!

 Authored By sandeep | The Telugu News | Updated on :12 February 2022,8:00 pm

Nadhiya : న‌దియా.. ఈవిడ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు సీనియ‌ర్ హీరోయిన్‌గా అద‌ర‌గొట్టిన న‌దియా ఇప్పుడు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేస్తుంది. అత్తారింటికి దారేది సినిమాలో పవన్‌కు పోటీ పడి మరీ అత్త పాత్రలో నటించిన నదియాకు ఆ సినిమా నుండి టాలీవుడ్‌లో మరింత క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం నదియా పలు చిత్రాల్లో నటిస్తూ.. బిజీగా గడుపుతోంది. ఈ నేపధ్యంలో మహేశ్ ‌బాబు-మురుగదాస్ సినిమా స్పైడ‌ర్‌లో కూడా ఓ పాత్రలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింద‌ట‌. మహేష్ తల్లి పాత్రలో మొదట నదియా ని అనుకున్నారట.కానీ ఆమె ఈ పాత్రకు నో చెప్పిందట. నిజానికి స్పైడర్ సినిమాలో మహేష్ అమ్మ క్యారెక్టర్ పెద్ద గా ఏం ఉండదు..

అందుకే నదియా ఈ సినిమాను వదులుకుందట. దీంతో మహేష్ తో నటించే అవకాశాని మిస్ చేసుకుంది ఈ సీనియ‌ర్ హీరోయిన్. ప్ర‌స్తుతం న‌దియా చాలా మంది సీనియ‌ర్ హీరోల‌కు కూడా త‌ల్లిగా, వ‌దిన‌గా, అక్క‌గా న‌టిస్తుంది. పెళ్లి తర్వాత మిర్చి సినిమాతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చిన నదియా.. అత్తారింటికి దారేది సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు సెలక్టివ్‌‌గా పాత్రలను ఎంచుకుంటూ ముందుకువెళ్తున్నారు.మొదటిసారిగా 1984లో మలయాళ సినిమాలో మోహన్‌‌లాల్ సరసన నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా తమిళ్, తెలుగు, మలయాళ చిత్రాలలో నటించింది. అప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న చిరంజీవి సరసన హీరోయిన్‌‌గా నటించే అవకాశం నదియాకి ఓ సారి వచ్చింది.

Nadhiya rejects maheshBabu movie

Nadhiya rejects maheshBabu movie

Nadhiya : న‌దియా అలా వ‌దులుకుంది…

కాని జ‌స్ట్ మిస్ చేసుకుంద‌ట‌. ఇప్పుడు చిరంజీవి సినిమాల‌లో న‌దియాని సపోర్టింగ్ రోల్‌కి సంప్ర‌దిస్తున్న‌ట్టు స‌మాచారం. న‌దియా ఇప్ప‌టికీ కుర్ర హీరోయిన్స్‌కి పోటీ ఇచ్చేలా త‌న అందంతో అల‌రిస్తుంది.కాగా, న‌దియా స్టార్ హీరోలందరితోను నటించింది. మంచి ఫామ్ లో ఉన్నసమయంలోనే 1988లో బిజినెస్ మ్యాన్ శిరీష్ గాడ్ బోల్‌ను వివాహం చేసుకున్నారు. అనంతరం నదియా శిరీష్ దంపతులు అమెరికన్ లోనే సెటిల్ అయ్యారు. ఈ దంపతులకు 1996 లో ఆడపిల్ల పుట్టింది. ఆమె పేరు సనమ్.. అనంతరం మళ్ళీ ఐదేళ్ల తర్వాత రెండో అమ్మాయి జానా కు జన్మనిచ్చింది నదియా.. ఇద్దరు కూతుళ్లు తల్లి అయినా ఇప్పటికీ నదియా అందంకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది