
priyamani intrested to acting
Priyamani : స్టార్ హీరోలందరితో కలిసి నటించి తెలుగు, తమిళం, మలయాళ ప్రేక్షకులని అలరించిన ముద్దుగుమ్మ ప్రియమణి. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సీరిస్ తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చి దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన తొలి ఓటీటీ మూవీ ‘భామా కలాపం’. ఈ సినిమా శుక్రవారం నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అభిమన్యు దర్శకుడిగా పరిచయమైన ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని సుధీర్ ఈదర, బాపినీడు కలిసి నిర్మించారు. ఈ సినిమా ప్రేక్షకులని అలరిస్తుంది. అయితే ప్రియమణి ఒకవైపు నటిగా అలరిస్తూనే మరో వైపు పలు రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ రాణిస్తోంది.
తాజాగా ప్రియమణి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ”నటిగా నాకింకా ఆకలి తీరలేదు. ఇంకా చేయాల్సిన పాత్రలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఫుల్ లెంగ్త్ నెగటివ్ రోల్ చేయాలని ఉంది. ఇప్పటికే కొంతమంది నాకు కథలు వినిపించారు. వినగానే నచ్చితే కచ్చితంగా చేస్తాను” అని అన్నారు ప్రియమణి. స్క్రీన్ మీద బోల్డ్ గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా కనిపించడం ఈజీ. కానీ అమాయకంగా కనిపించడం చాలా కష్టం. అందుకోసం కొంచెం ప్రాక్టీస్ చేశా. మిడిల్ క్లాస్ అమ్మాయిలు, లేడీస్ ఇంట్లో ఎలా ఉంటారో కనుక్కున్నా అని భామా కలాపం గురించి పలు విషయాలు చెప్పింది.నాకు వంట చేయడం రాదు. మా ఆయన వంట చేస్తాడు.
priyamani intrested to acting
వంట రూములోకి వెళ్లి ప్రయోగాలు చేయాలని నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఇప్పటిదాకా ఆయనెప్పుడూ నన్ను ఇది చేసి పెట్టు అని అడగలేదు. నాకు హోమ్ ఫుడ్ ఇష్టం. ఏదైనా ప్రేమతో చేసిపెడితే తింటాను. యుఎస్‌లో ఉన్న ఆయన ఆహా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని భామా కలాపం చూశారు. విరాటపర్వం సినిమాలో భరతక్క అనే కేరక్టర్ చేశా. రానా డిప్యూటీగా చేశా. రానా కేరక్టర్‌తో ట్రావెల్ చేసే పాత్ర అది. చాలా స్పెషల్ రోల్. డబ్బింగ్ అంతా అయిపోయింది. నార్త్ లో చేస్తున్న మైదాన్, కన్నడలో డాక్టర్ 56 , తమిళ్‌లో కొటేషన్ గ్యాంగ్… ఇలా అప్‌కమింగ్ మూవీస్ అన్నిటిలోనూ నా కేరక్టర్లు చాలా బావుంటాయి. ఫ్యామిలీమేన్3 కూడా ఉంది అని ప్రియమణి చెప్పుకొచ్చింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.