Naga Babu : ఇంట్లో చేసే పనులివా?.. నాగబాబు పరువుపాయే
Naga Babu : మెగా బ్రదర్‌గా నాగబాబు ఇండస్ట్రీలో, జనాల్లో ఓ క్రేజ్ ఉంది. బుల్లితెరపై నాగబాబు తన కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. ఎంటర్టైన్మెంట్ షోలకు జడ్జ్‌గా నాగబాబు తన ముద్ర వేసేసుకున్నాడు. నవ్వుల నవాబు నాగబాబులా మారిపోయాడు. టవర్ స్టార్ అంటూ ముద్దుగా పిలుస్తుంటారు. అయితే జబర్దస్త్ షో నుంచి నాగబాబు బయటకు వెళ్లడంతో కథ అంతా మారింది.ఆ తరువాత జీ తెలుగులో అదిరింది, బొమ్మ అదిరింది అంటూ షోలు చేసుకుంటూ వచ్చారు. అవి కాంట్రవర్సీల దెబ్బకు మూత పడ్డాయి.
ఆ తరువాత నాగబాబు మొత్తానికే బుల్లితెరకు దూరంగా ఉండిపోయాడు. అయితే నాగబాబు చాలా గ్యాప్ తరువాత మళ్లీ బుల్లితెర మీదకు వచ్చాడు. స్టార్ మా కామెడీ స్టార్స్ షోలో కనిపిస్తున్నాడు.అయితే ఇప్పుడు మళ్లీ నాగబాబు జెమినీ టీవీ ఉగాది ఈవెంట్‌కు వెళ్లాడు.అందులో నాగబాబు స్పెషల్ స్కిట్ వేసినట్టున్నాడు. తన ఇంట్లో చేసే పనులివే అన్నట్టుగా పరోక్షంగా సెటైర్లు వేశాడు. ఏ మగాడైన ఇంట్లో ఆ పనులే చేయాల్సిందన్నట్టుగా కౌంటర్లు వేశాడు.

Naga Babu Fun In Gemini TV Ugadi 2022 Full Kickku Event
బట్టలు ఉతకడం, అంట్లు తోమడంలో తనకు ఎంతో అనుభవం ఉందన్నట్టుగా పరోక్షంగా కౌంటర్లు వేశాడు. దీంతో అందరూ తెగ నవ్వేశారు.చమ్మక్ చంద్ర, రచ్చ రవి స్కిట్లో భాగంగా నాగబాబు ఈ సెటైర్లు వేశాడు. కూరలో ఉప్పు తగ్గిందని రచ్చ రవి అంటే.. నాగబాబు చిట్కాలు చెప్పేస్తాడు. ఇక బట్టలు ఉతికితే మరకలు పోలేదని కొట్టిందని రచ్చ రవి వాపోతాడు. ఎందుకు పోవురా అంటూ తనకు ఎంతో అనుభవం ఉందన్నట్టుగా నాగబాబు ఎక్స్ ప్రెషన్స్ పెట్టేశాడు. అనకొండలా ఉన్న నాగబాబు మణికొండలో చేసే పనులివా? అని ధన్ రాజ్ కౌంటర్ వేస్తాడు.
Inko okka rojulo mega entertainment mee munduku.
Full kickku | 2nd April | 5 PM#UgadiWithGeminiTV#GeminiTV#Anasuya #Nagababu@MukhiSree@geethasinger@RyanSohel@NagaBabuOffl pic.twitter.com/gR9yMY19DX— Gemini TV (@GeminiTV) April 1, 2022