Naga Babu : బుల్లితెరపై పేరడీ స్కిట్లు, సినిమా హీరోల డూపుల్లా నటించడం కొత్తేమీ కాదు. ఇక అవినాష్ అయితే బాలయ్యలా రెచ్చిపోతోంటాడు. చిరంజీవిలా నటిస్తుంటాడు. అదిరే అభి సైతం మెగా మ్యానరిజం బాగానే వాడుతుంటాడు. అయితే ఒక్కోసారి ఈ స్పూప్ స్కిట్లు విపరీతమైన ట్రోలింగ్‌కి గురవుతుంటాయి. అభిమానులు కొన్ని సందర్భాల్లో హర్ట్ అవుతుంటారు. తమ అభిమాన హీరోలను కించపరిచారంటూ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతుంటారు.ఆ మధ్య అలా కామెడీలు చేయడంతోనే బొమ్మ అదిరింది,
అదిరింది షోలు మూతపడ్డాయి. అందులో వైఎస్ జగన్, బాలయ్యలా వింత వింత స్కిట్లు వేసేవారు. ఈ దెబ్బతో అభిమానుల దాడి మొదలైంది. అలా షోనే అటకెక్కే పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు కామెడీ స్టార్స్ షోలో ఆర్ఆర్ఆర్ సినిమా స్పూప్ వేశారు. అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కాకుండా.. చిరంజీవి, బాలయ్యలను పెట్టి ఆర్ఆర్ఆర్ స్పూప్ చేసేశారు.చిరంజీవిగా అభి, బాలయ్యగా అవినాష్ నటించారు. అయితే ఇందులో బాలయ్య అతి కనిపిస్తుంది. బాలయ్య చెబితే సింహం, పులి, పాములు కూడా మాటలు వింటాయి.
భయపడతాయి అన్నట్టుగా చూపించారు. మొత్తానికి ఈ స్పూప్ చూసి అందరూ తెగ నవ్వేశారు. చిరు బాలయ్యల మధ్య ఉన్న స్నేహం చూపించేందుకు ఇలా చేశాం.. ఎవ్వరినీ కించపరిచేందుకు కాదు అని అవినాష్ క్లారిటీ ఇచ్చాడు.అయితే బాలయ్య అంటే గిట్టని నాగబాబు సైతం ఈ స్కిట్‌ను మెచ్చుకున్నాడు. మీరు ఏ మాత్రం ఎవ్వరినీ అగౌరవపరచలేదు.. స్కిట్ బాగా చేశారు.. నాది హామీ అన్నట్టుగా నాగబాబు చెప్పేశాడు. మొత్తానికి అవినాష్ అతి మాత్రం మరోసారి బయటకు వచ్చింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.