Naga Babu : చిరంజీవి బాలయ్య స్కిట్.. నాగబాబు కామెంట్స్ వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Naga Babu : చిరంజీవి బాలయ్య స్కిట్.. నాగబాబు కామెంట్స్ వైరల్

Naga Babu : బుల్లితెరపై పేరడీ స్కిట్లు, సినిమా హీరోల డూపుల్లా నటించడం కొత్తేమీ కాదు. ఇక అవినాష్ అయితే బాలయ్యలా రెచ్చిపోతోంటాడు. చిరంజీవిలా నటిస్తుంటాడు. అదిరే అభి సైతం మెగా మ్యానరిజం బాగానే వాడుతుంటాడు. అయితే ఒక్కోసారి ఈ స్పూప్ స్కిట్లు విపరీతమైన ట్రోలింగ్‌కి గురవుతుంటాయి. అభిమానులు కొన్ని సందర్భాల్లో హర్ట్ అవుతుంటారు. తమ అభిమాన హీరోలను కించపరిచారంటూ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతుంటారు.ఆ మధ్య అలా కామెడీలు చేయడంతోనే బొమ్మ అదిరింది, అదిరింది షోలు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :21 April 2022,8:00 pm

Naga Babu : బుల్లితెరపై పేరడీ స్కిట్లు, సినిమా హీరోల డూపుల్లా నటించడం కొత్తేమీ కాదు. ఇక అవినాష్ అయితే బాలయ్యలా రెచ్చిపోతోంటాడు. చిరంజీవిలా నటిస్తుంటాడు. అదిరే అభి సైతం మెగా మ్యానరిజం బాగానే వాడుతుంటాడు. అయితే ఒక్కోసారి ఈ స్పూప్ స్కిట్లు విపరీతమైన ట్రోలింగ్‌కి గురవుతుంటాయి. అభిమానులు కొన్ని సందర్భాల్లో హర్ట్ అవుతుంటారు. తమ అభిమాన హీరోలను కించపరిచారంటూ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతుంటారు.ఆ మధ్య అలా కామెడీలు చేయడంతోనే బొమ్మ అదిరింది,

అదిరింది షోలు మూతపడ్డాయి. అందులో వైఎస్ జగన్, బాలయ్యలా వింత వింత స్కిట్లు వేసేవారు. ఈ దెబ్బతో అభిమానుల దాడి మొదలైంది. అలా షోనే అటకెక్కే పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు కామెడీ స్టార్స్ షోలో ఆర్ఆర్ఆర్ సినిమా స్పూప్ వేశారు. అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కాకుండా.. చిరంజీవి, బాలయ్యలను పెట్టి ఆర్ఆర్ఆర్ స్పూప్ చేసేశారు.చిరంజీవిగా అభి, బాలయ్యగా అవినాష్ నటించారు. అయితే ఇందులో బాలయ్య అతి కనిపిస్తుంది. బాలయ్య చెబితే సింహం, పులి, పాములు కూడా మాటలు వింటాయి.

Naga Babu on Abhi And Avinash RRR Spoof In Comedy Stars

Naga Babu on Abhi And Avinash RRR Spoof In Comedy Stars

భయపడతాయి అన్నట్టుగా చూపించారు. మొత్తానికి ఈ స్పూప్ చూసి అందరూ తెగ నవ్వేశారు. చిరు బాలయ్యల మధ్య ఉన్న స్నేహం చూపించేందుకు ఇలా చేశాం.. ఎవ్వరినీ కించపరిచేందుకు కాదు అని అవినాష్ క్లారిటీ ఇచ్చాడు.అయితే బాలయ్య అంటే గిట్టని నాగబాబు సైతం ఈ స్కిట్‌ను మెచ్చుకున్నాడు. మీరు ఏ మాత్రం ఎవ్వరినీ అగౌరవపరచలేదు.. స్కిట్ బాగా చేశారు.. నాది హామీ అన్నట్టుగా నాగబాబు చెప్పేశాడు. మొత్తానికి అవినాష్ అతి మాత్రం మరోసారి బయటకు వచ్చింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది