naga babu shares work out video with Vaishnav Tej
Naga Babu : మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు, వైష్ణవ్ తేజ్.. చిరంజీవి పాట వింటూ పోటీ పడుతున్నారు. అది ఎక్కడో తెలుసా, జిమ్‌లో. ఇద్దరికి కాస్త సమయం దొరకడంతో జిమ్‌లో డంబెల్స్ పట్టుకొని నాగబాబు, వైష్ణవ్ పోటాపోటీగా కసరత్తులు చేశారు. నువ్వా నేనా అంటూ ఈ ఇద్దరు బాగా కష్టపడ్డారు. పది వర్కవుట్స్ బాగానే చేసి ఆ తర్వాత ఆపేశారు. మామతో అల్లుడు చేసిన ఫీట్స్ నెటిజన్స్ కి మంచి వినోదాన్ని పంచుతున్నాయి. మెగా హీరోలు ఏదో సందర్భంలో కలుస్తూనే ఉంటారు. తాజాగా జిమ్ లో మామ, అల్లుళ్లు సరదాగా వర్కవుట్స్ చేస్తూ కనిపించడం వినోదాన్ని పంచుతుంది.
మెగా మేనల్లుడు, యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. బుచ్చిబాబు సన దర్శకత్వలో వైష్ణవ్-కృతిశెట్టి జంటగా తెరకెక్కిన ఉప్పెన మూవీ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో వైష్ణవ్ నటన పరంగా సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత వైష్ణవ్ తేజ్ కొండపొలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీర ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ‘రంగ రంగ వైభవంగా’.
naga babu shares work out video with Vaishnav Tej
ఈ మూవీకి గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నాడు.రంగరంగ వైభవంగా చిత్రం మే 27న విడుదల కానుంది. ఇందులో వైష్ణవ్ సరసన ‘రొమాంటిక్’ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్ మూవీపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక నాగబాబు విషయానికి వస్తే ప్రస్తుతం మా టీవీలో కామెడీ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు తన తమ్ముడి పార్టీ కోసం కష్టపడుతున్నారు.
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్లోని కొత్తవాడలో ఇన్స్టాగ్రామ్లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.