Naga Babu : చిరంజీవి పాట వింటూ జిమ్‌లో పోటి ప‌డ్డ‌ నాగ‌బాబు, వైష్ణ‌వ్ తేజ్‌.. ఎవ‌రు గెలిచారు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Naga Babu : చిరంజీవి పాట వింటూ జిమ్‌లో పోటి ప‌డ్డ‌ నాగ‌బాబు, వైష్ణ‌వ్ తేజ్‌.. ఎవ‌రు గెలిచారు?

Naga Babu : మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు, వైష్ణ‌వ్ తేజ్.. చిరంజీవి పాట వింటూ పోటీ ప‌డుతున్నారు. అది ఎక్క‌డో తెలుసా, జిమ్‌లో. ఇద్ద‌రికి కాస్త స‌మ‌యం దొర‌క‌డంతో జిమ్‌లో డంబెల్స్ ప‌ట్టుకొని నాగబాబు, వైష్ణవ్ పోటాపోటీగా క‌స‌ర‌త్తులు చేశారు. నువ్వా నేనా అంటూ ఈ ఇద్ద‌రు బాగా క‌ష్ట‌ప‌డ్డారు. ప‌ది వ‌ర్క‌వుట్స్ బాగానే చేసి ఆ త‌ర్వాత ఆపేశారు. మామ‌తో అల్లుడు చేసిన ఫీట్స్ నెటిజ‌న్స్ కి మంచి వినోదాన్ని పంచుతున్నాయి. మెగా హీరోలు […]

 Authored By sandeep | The Telugu News | Updated on :21 February 2022,7:00 am

Naga Babu : మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు, వైష్ణ‌వ్ తేజ్.. చిరంజీవి పాట వింటూ పోటీ ప‌డుతున్నారు. అది ఎక్క‌డో తెలుసా, జిమ్‌లో. ఇద్ద‌రికి కాస్త స‌మ‌యం దొర‌క‌డంతో జిమ్‌లో డంబెల్స్ ప‌ట్టుకొని నాగబాబు, వైష్ణవ్ పోటాపోటీగా క‌స‌ర‌త్తులు చేశారు. నువ్వా నేనా అంటూ ఈ ఇద్ద‌రు బాగా క‌ష్ట‌ప‌డ్డారు. ప‌ది వ‌ర్క‌వుట్స్ బాగానే చేసి ఆ త‌ర్వాత ఆపేశారు. మామ‌తో అల్లుడు చేసిన ఫీట్స్ నెటిజ‌న్స్ కి మంచి వినోదాన్ని పంచుతున్నాయి. మెగా హీరోలు ఏదో సంద‌ర్భంలో క‌లుస్తూనే ఉంటారు. తాజాగా జిమ్ లో మామ‌, అల్లుళ్లు స‌ర‌దాగా వ‌ర్క‌వుట్స్ చేస్తూ క‌నిపించ‌డం వినోదాన్ని పంచుతుంది.

మెగా మేనల్లుడు, యంగ్‌ హీరో వైష్ణవ్ తేజ్‌ తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు. బుచ్చిబాబు సన దర్శకత్వలో​ వైష్ణవ్‌-కృతిశెట్టి జంటగా తెరకెక్కిన ఉప్పెన మూవీ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో వైష్ణవ్‌ నటన పరంగా సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత వైష్ణవ్ తేజ్ కొండపొలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీర ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ‘రంగ రంగ వైభవంగా’.

naga babu shares work out video with Vaishnav Tej

naga babu shares work out video with Vaishnav Tej

Naga Babu : పోటీ ప‌డి మ‌రీ బ‌రువులు ఎత్తుతున్నారు..

ఈ మూవీకి గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నాడు.రంగ‌రంగ వైభ‌వంగా చిత్రం మే 27న విడుద‌ల కానుంది. ఇందులో వైష్ణవ్ సరసన ‘రొమాంటిక్’ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్ మూవీపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక నాగబాబు విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం మా టీవీలో కామెడీ షోకి జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌రోవైపు త‌న త‌మ్ముడి పార్టీ కోసం క‌ష్ట‌ప‌డుతున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది