
Naga Babu want to re join in jabardasth comedy show
Naga Babu : జబర్దస్త్ కార్యక్రమానికి పూర్వ వైభవం రావాలని ప్రేక్షకులతో పాటు మాజీ కంటెస్టెంట్స్ మరియు టీం లీడర్స్ అంతా కోరుకుంటున్నారు. ఇటీవల అదిరే అభి సోషల్ మీడియా ద్వారా జబర్దస్త్ కార్యక్రమానికి ఏమైంది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన మళ్లీ జబర్దస్త్ కి పూర్వ వైభవం రావాలంటూ కోరుకుంటున్నానని పేర్కొన్నాడు. ఆహ్వానిస్తే తప్పకుండా జబర్దస్త్ షో కి వస్తాను అన్నట్లుగా ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. అదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జ్ గా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నాడట.
Naga Babu want to re join in jabardasth comedy show
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ తనకు మల్లెమాల వారితోను ఈటీవీ వారితో ఎలాంటి విభేదాలు లేవని.. మధ్యలో ఉన్న మేనేజర్స్ తోనే తనకు గొడవలు అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ మల్లెమాల వారు ఆహ్వానిస్తే తప్పకుండా జబర్దస్త్ కార్యక్రమానికి వెళ్తాను అంటూ ఒక మెట్టు కిందికి దిగినట్లుగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా అద్వాన్న పరిస్థితిలో ఉన్న జబర్దస్త్ కార్యక్రమానికి నాగబాబు ప్రకటన కచ్చితంగా బూస్ట్ ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు.
Naga Babu want to re join in jabardasth comedy show
కనుక మల్లెమాల వారు వెంటనే నాగబాబు ప్రకటనని స్వాగతించి అయన్ని మల్లెమాల లోకి ఆహ్వానిస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు ఒక అడుగు కిందికి దిగి వచ్చిన తర్వాత కూడా మల్లెమాల వారు పంతం వీడకుంటే కచ్చితంగా వారు ముందు ముందు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ జబర్దస్త్ అభిమానులు మరియు కంటెస్టెంట్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు రీ ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా షో మునుపటి జోరుతో ముందుకు సాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.