Mallemala : మల్లెమాలు వారు మరో కొత్త లేడీ జడ్జ్ ను తీసుకు వచ్చారు.. ఈమెకు అంత సీన్ ఉందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mallemala : మల్లెమాలు వారు మరో కొత్త లేడీ జడ్జ్ ను తీసుకు వచ్చారు.. ఈమెకు అంత సీన్ ఉందా?

Mallemala : ఈటీవీ లో ప్రసారమవుతున్న మల్లెమాల వారి కార్యక్రమాలు కొత్త కొత్త టాలెంట్స్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాయి. మల్లెమాల వారు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంకా పలు కార్యక్రమాలను ప్రేక్షకుల ముందు తీసుకొస్తున్నారు. అవి మాత్రమే కాకుండా పండుగ స్పెషల్ కార్యక్రమాలు అంటూ ఎన్నో ఈవెంట్స్ ని తీసుకు రావడం జరిగింది. ఇక మల్లెమాల వారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీకి కొత్త లేడీ జడ్జ్‌ దొరికినట్లే […]

 Authored By prabhas | The Telugu News | Updated on :9 January 2023,12:20 pm

Mallemala : ఈటీవీ లో ప్రసారమవుతున్న మల్లెమాల వారి కార్యక్రమాలు కొత్త కొత్త టాలెంట్స్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాయి. మల్లెమాల వారు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంకా పలు కార్యక్రమాలను ప్రేక్షకుల ముందు తీసుకొస్తున్నారు. అవి మాత్రమే కాకుండా పండుగ స్పెషల్ కార్యక్రమాలు అంటూ ఎన్నో ఈవెంట్స్ ని తీసుకు రావడం జరిగింది. ఇక మల్లెమాల వారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీకి కొత్త లేడీ జడ్జ్‌ దొరికినట్లే అంటూ ప్రేక్షకులు భావిస్తున్నారు.

గత కొన్ని రోజులుగా సీనియర్ నటి యమున మల్లెమాల వారి కార్యక్రమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. కనుక ఆమె ముందు ముందు వరుసగా ఈటీవీ కార్యక్రమాల్లో ముఖ్యంగా జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీలో సందడి చేసే అవకాశం ఉందని అంటున్నారు. గతం లో రోజా కారణంగా జబర్దస్త్ మరియు ఇతర కార్యక్రమాలకు మంచి పాపులారిటీ లభించింది. ఆ స్థాయిలో యమున కార్యక్రమాలకు పాపులారిటీని తీసుకు రాగలదా, ఆమెకు అంత సీన్ ఉందా అంటూ కొంత మంది ఈ సమయంలో చర్చించుకుంటున్నారు. యమున హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించింది.

mallemala bring new lady judge yamuna came

mallemala bring new lady judge yamuna came

ప్రస్తుతం బుల్లి తెరపై సీరియల్స్ తో సందడి చేస్తుంది. ఆ మధ్య కొన్ని వివాదాల కారణంగా వార్తల్లో నిలిచిన యమున ఇప్పుడు మళ్లీ సినిమాలు తో బిజీ అయింది. బుల్లి తెరపై తనదైన సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న యమునకు మల్లెమాల వారి నుండి వచ్చిన ఆఫర్ తో ఆమె స్థాయి మరింతగా పెరిగినట్లు అయింది అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ముందు ముందు ఆమె ఇంద్రజ మరియు రోజా ల స్థాయిలో ఈటీవీ మల్లెమాల లో సందడి చేసే అవకాశాలు లేకపోలేదు అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది