Home » Entertainment » Naga Chaitanya About Samantha Cooking In Sam Jam
Entertainment

టోటల్ డ్యామేజ్… సమంత పరువుతీసేసిన నాగ చైతన్య.. వీడియో

Authored By
Cinema Desk
The Telugu News | Published on: January 4, 2021, 5:30 pm
Advertisement

భార్య భర్తల ముచ్చట్లలో ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. అసలే సమంత ఇప్పుడిప్పుడే అన్ని పనులు నేర్చుకుంటోంది. అలాంటి సమంతపై నాగ చైతన్య సెటైర్లు వేశాడు. మామూలుగా అక్కినేని ఇంట్లో నాగార్జున, నాగ చైతన్యలే వంటలు బాగా చేస్తారు. అటు అమలకు, ఇటు సమంతకు వంటలు అంతగా రావు. కానీ ఈ లాక్డౌన్ సమయంలో సమంత వంటలు నేర్చుకుంది. చేయడం వరకు ఓ శిక్షకురాలి సాయంతో నేర్చుకుంది. మరి ఇంట్లో వంటలు వండుతుందో లేదో తెలియడం లేదు.

Advertisement

Naga chaitanya About Samantha Cooking In Sam Jam

కానీ తాజాగా నాగ చైతన్య మాటలతో సమంత పరువు మొత్తం పోయింది. తాజాగా సామ్ జామ్ షోకు సంబంధించిన ప్రోమో బయటకు వచ్చింది. ఇందులో సమంత తన భర్త నాగ చైతన్యతో ముచ్చట్లు పెట్టింది. అయితే ఇందులో తన గురించి తన భర్త ఏం అనుకుంటున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేసినట్టుంది. అందుకే తనకు సంబంధించిన ప్రశ్నలనే సమంత వేసింది. ఆ ప్రశ్నలకు నాగ చైతన్య ఇచ్చిన సమాధానంతో సమంత ఇమేజ్ టోటల్ డ్యామేజ్ అయినట్టుంది.

Advertisement

కుకింగ్‌కు పది మార్కుల్లో నాకు ఎన్ని మార్కులు ఇస్తావ్ అని సందేహంగానే సమంత అడిగింది. ఏంటి.. కుకింగా? అసలు నీకు వచ్చా? అనే ఉద్దేశ్యంలో సెటైర్ వేస్తూ సమంత పరువు తీసేశాడు నాగ చైతన్య. పోనీ అది వదిలేయ్.. ఇంటిని శుభ్రంగా ఉంచడంలో ఎన్ని మార్కులు వేస్తావ్ అని అడిగింది. ఇంటిని క్లీన్‌గానా? నువ్వా? అని చైతూ ఆశ్చర్య పోయాడు. చేస్తాను కదా అని సమంత సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. కానీ అది కుదరలేదు. అంటే సమంత ఇంట్లో గృహిణిగా ఫెయిల్ అయినట్టే.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి