Naga Chaitanya : ఫోటోలో అడ్డంగా బుక్ అయిన నాగ చైతన్య..ఆమెతో డేటింగ్..!!

Advertisement

Naga Chaitanya : 2021 అక్టోబర్ నెలలో అక్కినేని నాగ చైతన్య సమంత ఇద్దరు విడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇద్దరు తమ కెరియర్ పరంగా బిజీ అయిపోయారు. గత ఏడాది అక్టోబర్ నెలలో సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురికావడం జరిగింది. దాదాపు మూడు నెలలపాటు బలమైన ట్రీట్మెంట్ తీసుకున్న సమంత ఇప్పుడు మళ్ళీ సినిమా షూటింగ్ లలో జాయిన్ అవుతోంది. ఇదిలా ఉంటే సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య ఒంటరిగానే ఉంటూ వస్తున్నారు. కానీ “మేజర్” హీరోయిన్ శోభిత ధూళిపాళతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి.

Naga Chaitanya dating in Sobhita Dhulipala
Naga Chaitanya dating in Sobhita Dhulipala

అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఇద్దరూ ఎప్పుడు పెద్దగా స్పందించలేదు. గత ఏడాది జులై ఆ టైంలో ఇద్దరు దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ అది… ఎడిటింగ్ చేసిన ఫోటో అని ఎవరికి వారు కామెంట్లు చేశారు. అసలు వీరిద్దరికీ కనెక్షన్ ఎక్కడ కుదిరింది అన్నది ఇప్పటికీ కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇలాంటి తరుణంలో శోభిత ధూళిపాళతో నాగ చైతన్య డేటింగ్ లో ఉన్నట్లు ఓ ఫోటో అడ్డంగా బుక్ చేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే ఒక రెస్టారెంట్ లేదా అది

Advertisement

Is Naga Chaitanya dating Major actress Sobhita Dhulipala after split with  Samantha Ruth Prabhu? | Masala News – India TV

ఒక బార్ లో అక్కడ సర్వింగ్ చేసే బాయ్ తో నాగచైతన్య తో ఫోటో దిగటం జరిగింది. ఆ ఫోటోలో వెనుక భాగాన శోభిత ధూళిపాళ ఉంది. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారానికి.. ఈ ఫోటో మరింత బలం చేకూర్చింది. ఈ ఫోటో చూసి చాలామంది శోభిత ధూళిపాళ కారణంగానే సమంత మరియు నాగచైతన్య విడిపోయి ఉంటారని కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడం మాత్రమే కాదు.. సమంత నాగచైతన్య విడాకులకు సంబంధించిన విషయానికి పెద్ద చర్చకు దారితీస్తుంది.

Advertisement
Advertisement