Samantha : సమంత పారితోషికం తగ్గించుకుందట.. నాగ చైతన్య కారణం! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : సమంత పారితోషికం తగ్గించుకుందట.. నాగ చైతన్య కారణం!

Samantha : నాగ చైతన్య కు విడాకులు ఇచ్చిన తర్వాత సమంత తెలుగు లో ఎక్కువ సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఒక వైపు హిందీ లో వరుసగా ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి, తమిళంలో కూడా కమిట్ అయితే వరుసగా సినిమాలు వచ్చే అవకాశం ఉంది.. అయినా కూడా తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేసే ఉద్దేశంతో సమంత ఉన్నట్లు గా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. తెలుగులో కథ నచ్చితే మంచి బ్యానర్ అయితే దర్శకుడు మంచి ప్రతిభావంతుడు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :11 August 2022,12:00 pm

Samantha : నాగ చైతన్య కు విడాకులు ఇచ్చిన తర్వాత సమంత తెలుగు లో ఎక్కువ సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఒక వైపు హిందీ లో వరుసగా ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి, తమిళంలో కూడా కమిట్ అయితే వరుసగా సినిమాలు వచ్చే అవకాశం ఉంది.. అయినా కూడా తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేసే ఉద్దేశంతో సమంత ఉన్నట్లు గా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. తెలుగులో కథ నచ్చితే మంచి బ్యానర్ అయితే దర్శకుడు మంచి ప్రతిభావంతుడు అయితే పారితోషికం చాలా తక్కువ తీసుకొని కూడా సినిమా చేస్తానంటున్న సమంత ఇటీవల తన సన్నిహితుల వద్ద చెప్పు వచ్చిందంట.

తెలుగులోసమంత ఇంతగా సినిమాలు చేయడానికి కారణం ఏంటి అంటూ కొందరు చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో చాలా మంది నాగ చైతన్యను టీజ్ చేయడం కోసం అని అంటున్నారు. అలాగే ఆయనను డామినేట్ చేయాలని ఉద్దేశంతోనే సమంత ఇలా చేస్తోందంటూ ఊహిస్తున్నారు. సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత ఇప్పటి వరకు నాగచైతన్య ఏ ఒక్క నెగిటివ్ మాట కూడా సమంత గురించి మాట్లాడలేదు కానీ సందర్భం వచ్చిన ప్రతి సారి కూడా నాగచైతన్యను తక్కువ చేస్తూ సమంత మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది అంటూ అక్కినేని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Naga Chaitanya fans trolls on samantha due to her Telugu films

Naga Chaitanya fans trolls on samantha due to her Telugu films

తెలుగులో ఆమె వరుసగా సినిమాలు చేయడం వెనుక కూడా ఉద్దేశం నాగచైతన్యను అవమానించడమే అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగ చైతన్య ఇటీవల సమంత గురించి చాలా సానుకూలంగా మాట్లాడాడు. ఆమె మాత్రం మా ఇద్దరిని ఒక రూమ్‌ లో ఉంచితే పదునైన వస్తువులు అక్కడ ఉంచడం ప్రమాదం అన్నట్లుగా మాట్లాడింది. అలాగే కరణ్‌ షో లో చైతన్య ను భర్తగా పేర్కొనగా వెంటనే మాజీ భర్త అనాలంటూ కరణ్ కు సూచింది. అందుకే ఇప్పుడు నాగ చైతన్య అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది