Samantha : సమంత, నాగ చైతన్య టాలీవుడ్ క్రేజీ కపుల్స్ లో ఒకరు అనే మాదిరిగా ఉండేవారు. కాని పలు కారణాల వలన వారిద్దరు విడాకులు తీసుకొని అందరికి పెద్ద షాక్ ఇచ్చారు. వీరు విడిపోయిన చాలా రోజులే అవుతున్నా కూడా సమంత, నాగ చైతన్యకు సంబంధించిన ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంటుంది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న “యశోద” సినిమా టైటిల్ గ్లింప్స్ ఈ మధ్యనే విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ సినిమాని ఆగస్ట్ 12న విడుదల చేస్తున్నట్లుగా దర్శక నిర్మాతలు ప్రకటించారు.
మరోవైపు సమంత మాజీ భర్త నాగచైతన్య కూడా హిందీలో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న “లాల్ సింగ్ చద్దా” సినిమాని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల చేయబోతున్నారు. ఈ లెక్కలు చూసి సమంత, నాగ చైతన్య మధ్య పోటీ గట్టిగా ఉంటుందని అనుకున్నారు. కాని ఏమైందో ఏమో సమంత యశోద చిత్రం పోస్ట్ పోన్ అయింది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్‌ను పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాలో సమంత ముఖ్య పాత్రలో నటిస్తుండగా, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేశ్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి యశోద సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
చైతూకి భయపడే సమంత కాస్త వెనక్కు తగ్గిందేమోనని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సమంత ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే ఆమె పలు క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. దర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’ సినిమాను రిలీజ్‌కు రెడీ చేసింది సామ్. ఈ సినిమాతో పాటు మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘యశోద’లో కూడా సమంత నటిస్తోంది. ఈ సినిమాను హరి-హరీశ్‌లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సమంత పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉంటుందని, ఈ సినిమా ఆడియెన్స్‌ను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది.
Allu Arjun Biggest Cutout : పుష్ప 1 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప…
Cashews : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిలలో జీడిపప్పు కూడా ఒకటి. అయితే ఇది మన ఆరోగ్యానికి…
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉందా.. అదేంటి ఆమె లవ్ లో పడ్డ మ్యాటర్…
Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…
Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…
CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 98 పోస్టుల…
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్‌సి అన్నారు.…
This website uses cookies.