Naga Chaitanya : నాగ చైత‌న్య‌కి బిగ్ షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు..!

Authored By Sam C | The Telugu News | Published on: April 12, 2022, 1:30 pm

Naga Chaitanya : అక్కినేని నాగ చైత‌న్య వివాదాల‌కి చాలా దూరంగా ఉంటాడు. ఆయ‌న స‌మంత నుండి విడిపోయిన త‌ర్వాత సోష‌ల్ మీడియాలో కూడా పెద్ద‌గా యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. అయితే నాగ చైత‌న్య‌కు తాజాగా ట్రాఫిక్ పోలీసులు ఊహించ‌ని జ‌ల‌క్ ఇచ్చారు. ఇటీవలి కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీలకు వరుసపెట్టి జరిమానాలు విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. నిబంధనలు అతిక్రమిస్తే సామాన్యులైనా, సెలబ్రిటీలైనా ఒక్కటేనని చెప్పకనే చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్, కల్యాణ్ రామ్‌‌లకు కూడా ‘బ్లాక్ ఫిల్మ్’ కారణంగా ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. గత వారం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కారుకు బ్లాక్‌ ఫిల్మ్‌తో వెళ్తుండగా… వాహనాన్ని ఆపి జరిమానా విధించారు.

తాజాగా టాలీవుడ్ హీరో నాగ చైతన్యకు హైదరాబాద్ పోలీసులు ఫైన్ వేశారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో నాగ చైతన్య కారుకు నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్ అద్దాలు అమర్చి ఉండటంతో పోలీసులు బ్లాక్ ఫిల్మ్‌ను తొలిగించారు. అంతేకాదు ఈయన నడిపిస్తోన్నకారుకు రూ. 700 రూపాయల చలాన్‌ విధించారు. దీంతో పాటు ఆ దారిలో నిబంధనలకు విరుద్దంగా వెళుతున్న మరికొంత మందిపై పోలీసులు జరిమానాలు విధించారు. కేవలం ‘వై’ కేటగిరీ భద్రత ఉన్నవారికి మాత్రమే బ్లాక్ ఫిల్మ్ నుంచి మినహాయింపు ఉంది.ఈ మేరకు గతంలో సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

Naga Chaitanya fined by police

Naga Chaitanya fined by police

Naga Chaitanya : అడ్డంగా బుక్క‌య్యాడుగా..

ఈ నేపథ్యంలో బ్లాక్ ఫిల్మ్‌తో కనిపించే కార్లకు జరిమానా తప్పట్లేదు. ఇకనైనా సెలబ్రిటీలు రోడ్ల పైకి వచ్చే ముందు తమ వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ తొలగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. నాగ చైతన్య విషయానికొస్తే.. గత యేడాది ‘లవ్ స్టోరీ’ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. ఇక ఇటీవల సంక్రాంతి కానుకగా తన తండ్రి నాగార్జునతో కలిసి ఈయన చేసిన సినిమా బంగార్రాజు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ప్ర‌స్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ కోసం ఆయన విక్రమ్ కె.కుమార్‌తో కలిసి ఓ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వెబ్ సిరీస్ చేస్తున్నారు.

Sam C

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp