Home » Entertainment » Naga Chaitanya Love Affair With A Telugu Girl
Entertainment

Naga Chaitanya : తెలుగు అమ్మాయితో నాగ చైతన్య ప్రేమ‌యాణం..? త‌న డ్రీమ్ హౌస్ చూపించి..!

Authored By
mallesh
The Telugu News | Published on: June 21, 2022, 7:30 pm
Advertisement

Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య ఓ తెలుగు హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడ‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే చైతూ ఆమెతో రెండో పెళ్లికి సిద్ద‌మ‌వుతున్నాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం థ్యాంక్యూ మూవీతో బిజీగా ఉన్న చైత‌న్య ఓ తెలుగు హీరోయిన్ తో క‌లిసి పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో కూడా హీరోయిన్ కృతిశెట్టితో ల‌వ్ లో ఉన్నాడ‌ని రూమ‌ర్స్ వ‌చ్చాయి. బంగార్రాజు మూవీల ఈ ఇద్ద‌రూ క‌ల‌సి న‌టించ‌డంలో కెమిస్ట్రీ వ‌ర్కౌట్ అయింద‌ని అందుకే ఇద్ద‌రు లవ్ లో ఉన్నార‌ని వైరల్ చేశారు. అలాగే ప్ర‌స్తుతం మ‌రో తెలుగు అమ్మ‌యి..

Advertisement

తెలుగు, హిందీ చిత్రాల్లో న‌టించిన హీరోయిన్ తో ప్రేమ‌లో ఉన్న‌డ‌ని ఇద్ద‌రూ క‌లిసి పార్టీల్లో తిరుగుతున్నార‌ని ప్ర‌చారంలో ఉంది. ఇటీవ‌ల నాగ చైతన్య ఆ హీరోయిన్ బర్త్ డే వేడుక నిర్వహించి హైదరాబాద్ లో నిర్మించుకుంటున్న తన డ్రీమ్ హౌస్ కి కూడా ఆమెను తీసుకెళ్లారట. దీంతో వీళ్లు ఇద్ద‌రు పెళ్లి చేసుకుని అదే ఇంట్లో కాపురం పెడుతున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు. స‌మంత‌తో డైవ‌ర్స్ త‌ర్వ‌త చైతూ దాదాపు ఏడాది కాలంగా సింగిల్ గానే ఉండిపోయాడు. విడాకుల తర్వాత కెరీర్ పై ఫోక‌స్ పెట్టిన చైతూ మ‌ళ్లీ తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ప్రేమ‌లో ప‌డ్డారంట‌. కొద్దిరోజులుగా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నార‌ని స‌మాచారం.

Naga Chaitanya love affair with a Telugu girl

Advertisement

Naga Chaitanya : బ‌ర్త్ డే పార్టీ సెల‌బ్రేట్ చేసి..

కాగా మే 31న శోభిత బర్త్ డే కాగా ఓ హోటల్ లో ఘనంగా సెల‌బ్రేట్ చేశార‌ని టాక్. ఇక హైదరాబాద్ లో చైతూ నిర్మించుకుంటున్న తన డ్రీమ్ హౌస్ శోభితను స్పెష‌ల్ గా తీసుకెళ్లి చూపించార‌ట‌. వీళ్ళ మధ్య గాఢ‌మైన ప్రేమ మొదలైందని టాలీవుడ్ వర్గాలు కూడా అవున‌నే అంటున్నాయ‌ట‌. ఇక గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శోభిత దూళిపాళ్ల రామన్ రాఘవ్ 2.0 హిందీ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇక తెలుగులో అడివి శేష్ హీరోగా న‌టించిన గూడాచారి సినిమాలో న‌టించింది. ఈ సినిమా మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. లేటెస్ట్ గా మేజర్ మూవీలో కూడా క‌నిపించారు. ప్రస్తుతం శోభిత మణిరత్నం ద‌ర్వ‌క‌త్వంలో వ‌స్తున్న‌ పాన్ ఇండియా చిత్రం పొన్నియిన్ సెల్వం మూవీలో నటిస్తున్నారు. అలాగే ఓ హిందీ చిత్రం, మంకీ మాన్ అనే హాలీవుడ్ మూవీలో కూడా న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి