Naga shourya : నాగ శౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ‘లక్ష్య’. డిసెంబర్ 10న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను సీనియర్ హీరో విక్టరి వెంకటేష్ చేతుల మీదుగా విడుదల చేశారు. కార్యక్రమంలో చిత్ర హీరో నాగ శౌర్య మాట్లాడుతూ.. లక్ష్య సినిమా కోసం రెండున్నరేళ్లుగా చాలా కష్టపడినట్లు తెలిపారు. దర్శకుడు సంతోష్ జాగర్లపూడి చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్లు తెలిపారు. సంగీత దర్శకుడు కాళ భైరవ తన స్నేహితుడంటూ ఐదేళ్ల నుంచి అతనితో కలిసి పని చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కాళ భైరవ సమకూర్చిన నేపథ్య సంగీతం… ఈ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
హీరోయిన్ కేతిక శర్మ గురించి మాట్లాడుతూ.. రొమాంటిక్ సినిమాలో లాగే ఆమె ఈ చిత్రం లో అందంతో ఆకట్టుకుంటుందని అన్నారు. కేతిక లాంటి గ్లామర్ డాల్ ను చూస్తే నాకే కాదు.. ఎవ్వరికైనా సరే రొమాన్స్ చేయాలనిపిస్తుందని ఏ మొహమాటం లేకుండా చెప్పారు. ఏ హీరోయిన్ కూడా ఇండస్ట్రీకి వచ్చిన వెంటనే ఇంత అభిమానాన్ని సంపాదించుకాలేదన్నారు. అలాగే ఈ చిత్రంలో జగపతి బాబు, సచిన్ ఖేద్కర్ గారితో కలిసి నటించడం తనకు గర్వంగా ఉందంటూ.. వారి పాత్రలు ఆధ్యంతం అలరించేలా ఉంటాయని వివరించారు.
సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను.. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగ శౌర్య వరుడు కావలెను మూవీతో ఇటీవల డీసెంట్ హిట్ కొట్టారు. ఈ మేరకు రాబోయే లక్ష్య సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.