
Aanand Devarakonda Romance with Saiyami Kher
Aanand Devarakonda : ఇటీవల పుష్పక విమానం సినిమాతో మంచి విజయం సాధించారు యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఆయన హీరోగా కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్ థ్రిల్లర్ `హైవే`. ఈ సినిమాలో పూర్తిగా సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు ఆనంద్ దేవరకొండ. మలయాళ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోంది. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో మీర్జాపూర్, పాతాళ్‌లోక్ వంటి సిరీస్‌లతో తెలుగులోనూ ఫేమస్ అయిన బాలీవుడ్ నటుడు అభిషేక్ బెనర్జి కీలకపాత్ర పోషిస్తుండగా బాలీవుడ్ హాట్ బ్యూటీ సయామీఖేర్ ముఖ్య పాత్రలో నటిస్తోంది. భారీ అంఛనాలతో రూపొందుతోన్న ఈ చిత్రం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశలో ఉన్నాయి. మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయనున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన నటీనటుల కాన్సెప్ట్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి.
Aanand Devarakonda Romance with Saiyami Kher
చిత్ర నిర్మాత వెంకట్ తలారి మాట్లాడుతూ – ‘‘118 వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన గుహన్ గారి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, మానస రాధా కృష్ణన్ హీరో హీరోయిన్లుగా హైవే చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్స్ అభిషేక్ బెనర్జి, సయామీఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మా బ్యానర్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెరకెక్కించాం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు చివరిదశలో ఉన్నాయి“ అన్నారు. చిత్ర దర్శకుడు కేవీ గుహన్ మాట్లాడుతూ – ‘‘ఒకరితో ఒకరికి సంభంధం లేని నలుగురు వ్యక్తుల కథే `హైవే’ . పూర్తిగా హైవే నేపథ్యంలోనే సాగే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. టెక్నికల్ పరంగా హై స్టాండర్డ్‌లో ఉంటుంది“ అన్నారు.
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.