Home » Entertainment » Nagababu About Jabardasth Entry
Entertainment

Nagababu : మెగా బ్రదర్ యూటర్న్.. జబర్దస్త్ ఎంట్రీపై నాగబాబు కామెంట్స్

Authored By
Cinema Desk
The Telugu News | Published on: August 11, 2021, 1:00 pm
Advertisement

Nagababu : మెగా బ్రదర్ నాగబాబు బుల్లితెరపై వేసిన ముద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపై నటుడిగా నిర్మాతగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తరువాత మళ్లీ బుల్లితెరపై నాగబాబు తన సత్తాను చాటాడు. సీరియల్స్, ఎంటర్టైన్మెంట్ షోలంటూ ఫుల్ బిజీగా గడిపాడు. జబర్దస్త్ షో అంటే నాగబాబు, నాగబాబు అంటే జబర్దస్త్ అనే స్థాయికి చేరాడు. అలాంటి నాగబాబు అందరికీ షాకిస్తూ జబర్దస్త్‌ను వీడాడు. జబర్దస్త్ నుంచి వెళ్తూ మల్లెమాల మీద ఆరోపణలు చేశాడు.

Advertisement

Nagababu About Jabardasth Entry

మల్లెమాల అందరినీ కట్టిపడేస్తోందని, అగ్రిమెంట్ల పేరుతో హింసిస్తుందని, ఆర్టిస్ట్‌లను పట్టించుకోదని, సరైన భోజనం కూడా పెట్టదని ఇలా రకరకాలుగా ఆరోపణలు చేశాడు. ఆ తరువాత నితిన్ భరత్ అనే డైరెక్టర్ల కోసం అదిరింది షోకి వెళ్లాడు. కొన్ని రోజులు అది కూడా బాగానే రన్ అయింది. ఆ తరువాత బొమ్మ అదిరిందిగా మారిపోయింది. వైఎస్ జగన్ మీదే కౌంటర్లు వేస్తుండటంతో షో మొత్తానికే మూత పడిపోయింది. అలా ఇప్పుడు నాగబాబు బుల్లితెరకు పూర్తిగా దూరంగా ఉన్నాడు

Advertisement

మెగా బ్రదర్ యూటర్న్.. జబర్దస్త్ ఎంట్రీపై నాగబాబు కామెంట్స్

అయితే తాజాగా నాగబాబు జబర్దస్త్ ఎంట్రీ గురించి మాట్లాడాడు. జబర్దస్త్ వాళ్లకు తన అవసరం ఉందని అనిపిస్తే.. వాళ్లు పిలిస్తే వెళ్తాను అని అన్నాడు. జబర్దస్త్ షో అనే దానికి ఓ లెవెల్ ఉంది.. అందులో నేను ఉన్నా లేకపోయినా జనాలు చూస్తారు.. ఆల్రెడీ అది అలాంటి బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది అని నాగబాబు చెప్పుకొచ్చాడు. అంటే నాగబాబు వరుస చూస్తుంటే.. జబర్దస్త్ షోలోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ మల్లెమాల నుంచి మళ్లీ పిలుపు వస్తుందా? అనేది అనుమానం.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి