
Nagababu : నిహారిక కు పెళ్లి చేసి తప్పు చేసాం.. విడాకులపై నాగబాబు క్లారిటీ .. నాగబాబు
Nagababu : మెగా ఫ్యామిలీ సభ్యుడు, నటుడు, ఎమ్మెల్సీ నాగబాబు తాజాగా తన కుటుంబ విషయాలపై స్పందించారు. ముఖ్యంగా తన కుమారుడు వరుణ్ తేజ్, కోడలు లావణ్య త్రిపాఠి వివాహం, కుమార్తె నిహారిక వివాహం, విడాకుల అంశాలపై ఓపెన్‌గా మాట్లాడారు. వరుణ్ ప్రేమ వ్యవహారంపై మొదట్లో తెలియలేదని, తరువాత వాడే వచ్చి లావణ్యను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెబితే తాను ఓకే చెప్పానని, ‘‘నువ్వు హ్యాపీగా ఉంటే చాలు’’ అనే దృక్పథంతో వెంటనే ఓకే చెప్పినట్టు తెలిపారు.
Nagababu : నిహారిక కు పెళ్లి చేసి తప్పు చేసాం.. నాగబాబు
వరుణ్ తేజ్ లావణ్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నారంటూ నాగబాబు హర్షం వ్యక్తం చేశారు. తన నిర్ణయం విజయవంతమైందని అభిప్రాయపడ్డారు. అయితే నిహారిక విషయానికి వస్తే ఆ పెళ్లిని తామే నిశ్చయించామని, కానీ వారిద్దరూ కలిసి ఉండలేకపోయారని, అవగాహన లోపంతో విడిపోయారని వెల్లడించారు. నిహారికకు పెళ్లి ఇష్టం లేదని , కాకపోతే అప్పుడు ఆ పరిస్థితి ఆలా వచ్చిందన్నారు.
తాను ఎప్పుడూ పిల్లల జీవితాల్లో జోక్యం చేసుకోలేదని, వారు తీసుకునే నిర్ణయాల్లో స్వేచ్ఛ ఇవ్వడం తండ్రిగా తన ధర్మమని నాగబాబు స్పష్టంగా చెప్పారు. ‘‘నిహారిక విడిపోవాలనుకుంటున్నదని చెప్పినప్పుడు నేను ఆలోచించావా అని మాత్రమే అడిగాను. ఆమె ‘అవును’ అన్నప్పుడు, ‘నీ ఇష్టం’ అని సమాధానమిచ్చాను’’ అని తెలిపారు. మీడియాలో వచ్చే వార్తల్ని పట్టించుకోనని, పిల్లలు సంతోషంగా ఉన్నంతవరకూ తాను సంతృప్తిగా ఉంటానని స్పష్టంచేశారు. నిహారిక భవిష్యత్‌లో మళ్లీ పెళ్లి చేసుకుంటుందో లేదో అన్నది కాలమే చెప్పాలనన్నారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.