nagababu falls down for sreemukhi singing
sreemukhi : బుల్లి తెర ఫీమేల్ యాంకర్ లలో శ్రీముఖికి యూత్ లో పిచ్చ క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. శ్రీముఖి ఏ షో చేసినా… అందులో తను చేసే అల్లరి అంత ఇంతా కాదు. అయితే షోలలో మాత్రమే కాక అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల్లో కూడా రకరకాల కామెడీ వీడియోలు, డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ తన అభిమానులను నిత్యం అలరిస్తూ ఉంటుంది. అయితే ఇటీవల టాలీవుడ్ మెగా బ్రదర్ నాగబాబుతో కలిసి శ్రీముఖి చేసిన ఓ వీడియో తాజాగా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.ఇటీవల నాగబాబును కలిసిన శ్రీముఖి తనకున్న ఓ స్పెషల్ ట్యాలెంట్ తో అతనిని ముప్పు తిప్పలు పెట్టింది.
ఎదో సరదాగా ఓ పాట పాడి వినిపించమని అడిగిన నాగబాబు కోసం… గాయని లెవల్ లో ‘దర్ దర్ బాద్ తుక్‌డే’ .. అంటూ రెచ్చిపోయి ఓ సాంగేసుకుంది. శ్రీముఖి పాట స్టార్ట్ చేసిన కొద్ది సెకన్లకే.. అది భరించలేని నాగబాబు కళ్లు తిరిగి కింద పడిపోయినట్లు కాసేపు నటించాడు. బాబుగారు అని శ్రీముఖి లేపినా లేవలేదు. ఇలా నవ్వుల బాబు నాగబాబు చేసిన కామెడీ.. ప్రస్తుతం నెటిజన్లలో నవ్వులు పూయిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా శ్రీముఖినే తన ఇన్‌స్టా గ్రాంలో అభిమానులతో పంచుకుంది. బాబు బంగారం.. కాన్సెప్ట్, డైరెక్షన్ స్వీట్ పర్సన్ నాగబాబుగారిదే అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ పోస్ట్ కింద… ఏంటి శ్రీముకి నీ పాటతో మా నాగబాబును చంపేస్తావా అని అభిమానులు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
nagababu falls down for sreemukhi singing
యాంకర్ కొనసాగుతూనే నటిగా పలు చిత్రాలతో బిజీగా ఉన్న శ్రీముఖి… బిగ్‌బాస్ సీజన్ 3లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది. ఎప్పుడూ బిజీగా ఉండే ఈ బబ్లీ యాంకర్…. వీలున్నప్పుడల్లా సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియోతో అభిమానులతో టచ్ లో ఉంటూ ఉంటుంది. ఇక జబర్థస్త్ మానేసిన అనంతరం.. ఓ కామెడీ షో చేసిన నాగబాబు ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే.. మరో వైపు తను సొంతంగా ఇటీవల ప్రారంభించిన యూ ట్యూబ్ ఛానెల్ తో బిజీగా మారారు.
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
This website uses cookies.