Brahmanandam : బ్రహ్మానందంపై నాగబాబు ఆసక్తికర కామెంట్స్.. ఆయన ఇండస్ట్రీకి రాకుంటే పరిస్థితి ఏంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Brahmanandam : బ్రహ్మానందంపై నాగబాబు ఆసక్తికర కామెంట్స్.. ఆయన ఇండస్ట్రీకి రాకుంటే పరిస్థితి ఏంటి?

 Authored By mallesh | The Telugu News | Updated on :15 January 2022,11:30 am

Brahmanandam : బ్రహ్మానందం ఈ పేరు వింటే చాలు.. ఆయన ఎక్స్‌ప్రెషన్స్, కామెడీ డైలాగులు వెంటనే గుర్తొచ్చేస్తాయి. ఎంతటి కోపంలో ఉన్నవారైన ఆయన కామెడీ చూస్తే నవ్వాల్సిందే. అలాంటి బ్రహ్మనందంపై మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సుమారు మూడు తరాల ఆడియన్స్‌ను నవ్విస్తూ వస్తున్నాడు బ్రహ్మానందం. ఆయన ఎలాంటి డైలాగ్ కొట్టకపోయిన సరే.. తెరపై ఆయన ఫేస్ కనిపించగానే నవ్వుల వర్షం కరుస్తుంది. సినిమాకు వెళ్లిన ప్రేక్షకులు.. ఆయన ఒక్క సీన్‌లో నైనా కనిపించకపోతారా అంటూ ఎదురుచూస్తుంటారు.

కొందరైతే ప్రత్యేకంగా ఆయన కోసమే సినిమాకు వెళ్తారనడంలో ఎలాంటి డౌట్ లేదు. డైరెక్టర్లు సైతం ఆయన కోసం ప్రత్యేక పాత్రను సృష్టిస్తుంటారు. ప్రస్తుతం పండుగ సందర్భంగా ఓ టీవీ చానెల్ లో నిర్వహించిన దావత్ అనే ప్రోగ్రాంకు చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు బ్రహ్మానందం. ఆయన తన ఎక్స్‌ప్రెషన్స్‌తో, కామెడీతో అక్కడున్న వారందరినీ కడుపుబ్బా నవ్వించారు. ఈ సందర్భంగా నాగబాబు తన మనసులో విషయాలను ఒక్కొక్కటిగా బయటపెట్టారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీకి రేలంగి తర్వాత బ్రహ్మానందం లేకుంటే ఇండస్ట్రీ ఉప్పులేని కూరలాగా ఉండేది అంటూ కామెంట్స్ చేశాడు నాగబాబు. ఉప్పులా ఎంటరయ్యాడు మహానుభావుడు అంటూ బ్రహ్మానందాన్ని ఉద్దేశించి అన్నాడు మెగా బ్రదర్.

nagababu interesting comments on brahmanandam

nagababu interesting comments on brahmanandam

Brahmanandam : ఉప్పులేని కూరలాగా ఉండేది

ఆయన ప్రత్యేకించి ధానదర్మాలు చేయాల్సిన అవసరం లేదని, ఆయన కామెడీని చూసిన ప్రతివారు నవ్వుకుంటారని, ఆ పుణ్యం ఆయనకే వస్తుందని చెప్పుకొచ్చారు. ఆయన ధన్యజీవి అంటూ పొగిడారు. కమెడిడయన్‌లలో టాలీవుడ్‌లో బ్రహ్మానందమే నంబర్ వన్ అని, ఆయన ముందు, తర్వాత ఎవరూ లేరన్నారు. నవ్వుకు కేరాఫ్ అని బ్రహ్మానందాన్ని పొగిడారు. ఇక బ్రహ్మానందంపై నాగబాబు చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది