Nagababu YCP : బ్రేకింగ్ న్యూస్‌.. ‘వైసీపీ హిందూ ద్రోహి’ అంటూ సంచలన వీడియో రిలీజ్ చేసిన నాగబాబు

Authored By Sudheer Ramanujam | The Telugu News | Updated on : 6 February 2026, 2:20 pm
  •  తమ్ముడి క్లాస్ తర్వాత నోటికి మరింత పని చెప్పిన ఎమ్మెల్సీ నాగబాబు

Nagababu YCP  : ఏపీ రాజకీయాల్లో విమర్శల పర్వం తారాస్థాయికి చేరింది. జనసేన పార్టీ Janasena  అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన తర్వాత, ఆ పార్టీ కీలక నేత మరియు ఎమ్మెల్సీ నాగబాబు వైసీపీపై మునపటి కంటే ఘాటుగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా విడుదల చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. “వైసీపీ హిందూ ద్రోహి” అనే నినాదంతో ఆయన గత ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. ముఖ్యంగా తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వాడారనే అంశాన్ని ప్రస్తావిస్తూ నాగబాబు నిప్పులు చెరిగారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన వేంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేయడం కేవలం పరిపాలనా లోపం మాత్రమే కాదని, అది ముమ్మాటికీ హిందూ ధర్మంపై జరిగిన దాడి అని ఆయన మండిపడ్డారు. లడ్డు తయారీలో నాణ్యత లేని పదార్థాలను వాడటం ద్వారా భక్తుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Nagababu YCP : బ్రేకింగ్ న్యూస్‌.. 'వైసీపీ హిందూ ద్రోహి' అంటూ సంచలన వీడియో రిలీజ్ చేసిన నాగబాబు

Nagababu YCP : బ్రేకింగ్ న్యూస్‌.. ‘వైసీపీ హిందూ ద్రోహి’ అంటూ సంచలన వీడియో రిలీజ్ చేసిన నాగబాబు

Nagababu YCP అక్రమ మార్గాల్లో ధనార్జన చేయడమే లక్ష్యంగా శ్రీవారి సొమ్ము దుర్వినియోగం

ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాత్రపై నాగబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. తన స్వలాభం కోసం, అక్రమ మార్గాల్లో ధనార్జన చేయడమే లక్ష్యంగా శ్రీవారి సొమ్మును దుర్వినియోగం చేశారని విమర్శించారు. కల్తీ నెయ్యి సరఫరా చేసే సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ఇది హిందూ సమాజం ఎన్నటికీ క్షమించరాని మహాపాపమని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం హిందూ దేవాలయాలను, వాటి ఆస్తులను ఒక వ్యాపార వస్తువులా చూశారే తప్ప, భక్తితో సేవ చేయలేదని నాగబాబు దుయ్యబట్టారు.

నాగబాబు వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం

నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ గతంలోనే సనాతన ధర్మ రక్షణ గురించి మాట్లాడగా, ఇప్పుడు నాగబాబు దానిని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. వైసీపీని కేవలం రాజకీయ ప్రత్యర్థిగానే కాకుండా, ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసిన పార్టీగా చిత్రికరించడంలో జనసేన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ‘కల్తీ లడ్డు’ వ్యవహారం మరిన్ని విచారణలకు, అరెస్టులకు దారితీసే అవకాశం ఉందని ఆయన సంకేతాలిచ్చారు. భక్తుల పక్షాన జనసేన పోరాటం కొనసాగుతుందని, దోషులకు శిక్ష పడే వరకు వదిలిపెట్టమని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Sudheer Ramanujam

Sudheer Ramanujam Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి