Home » Entertainment » Nagababu Warning To Tammareddy Bharadwaj About Pawan Kalyan
Entertainment

Nagababu – Tammareddy : తమ్మారెడ్డి నువ్వెంత నీ బతుకెంతరా.. చిరంజీవి, పవన్ ను విమర్శించే స్థాయా నీది.. నాగబాబు

Authored By
Breaking News 2
The Telugu News | Published on: March 10, 2023, 2:00 pm
Advertisement

Nagababu – Tammareddy : మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు మరోసారి సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజపై ఆయన ఫైర్ అయ్యారు. తాజాగా సోషల్ మీడియాలో ఆయన ఓ వీడియోను వదిలారు. పవన్ కళ్యాణ్, చిరంజీవిని తమ్మారెడ్డి విమర్శించడంతో నాగబాబు రెచ్చిపోయారు. మీరు విషం కక్కుతుంటే చేతులు కట్టుకొని కూర్చుంటామనుకున్నారా? మీరు ఇప్పటికి చాలా ఎక్కువ మాట్లాడారు. అయినా మేము ఎవ్వరం మాట్లాడలేదు.

Advertisement

Nagababu Warning to Tammareddy About His Comments On Pawan Kalyan And Chiranjeevi

కానీ.. మీరు శృతి మించితే తీవ్ర స్థాయిలో కౌంటర్స్ ఇస్తామన్నారు నాగబాబు. అటు చిరంజీవిని విమర్శిస్తారు.. ఇటు పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తారు. మీరేంటి మోడల్ పోలీసా? ఎవరు ఎలా బతకాలో చెబుతారా? ముందు మీ బతుకు మీరు బతకండి. మీ బతుకు ఎలా బతకాలో ఆలోచించండి. లేస్తే మనిషి మీద బిల్డప్ తో ఎవరి మీద పడితే వాళ్ల మీద నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు. ఇది మీకే చెబుతున్నాను. ఇంకెప్పుడు అర్థం పర్థం లేకుండా మాట్లాడకండి అంటూ నాగబాబు హితువు పలికారు. ప్రమోషన్ కోసం 80 కోట్లు ఖర్చు పెట్టామని మాట్లాడుతున్నారు.

Advertisement

Nagababu – Tammareddy : ప్రమోషన్ కోసం 80 కోట్లు ఖర్చు పెట్టామని మాట్లాడుతారా?

అంత విషం కక్కుతారా? ఆ కుర్రాళ్లు ఇద్దరు డ్యాన్స్ చేశారు. ఎన్టీఆర్, చరణ్. ఆ లెగ్ వర్క్ చూశారా? మనం ఒకసారి గట్టిగా లేచి నిలబడితేనే మన మోకాళ్లు పని చేయవు. ఒకసారి ఊపి చూడండి. అప్పుడు తెలుస్తుంది. అది చాలా కష్టమైన డ్యాన్స్. వాళ్లు అంత అందంగా చేస్తే మీరు మెచ్చుకోకుండా దానిపై విమర్శలు చేస్తున్నారు. దాన్ని ఎంత అద్బుతంగా రాజమౌళి గారు తెర మీదికి తీసుకొచ్చారు. దాన్ని కదా మనం ప్రశంసించాలి. మన సినిమాను మనం గౌరవించుకోకుండా విమర్శిస్తారా? ఇంత విషం కక్కుతారా? అంటూ తమ్మారెడ్డి భరద్వాజపై నాగాబాబు సీరియస్ అయ్యారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి