Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 సూపర్ హిట్ అయిన నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ ను ఎంతగా ఆధరిస్తున్నారో అర్థం అయ్యింది. సోషల్ మీడియాలో ఒక్కో కంటెస్టెంట్స్ కోసం ఫ్యాన్స్ క్రియేట్ అయ్యి చేసే హంగామా మామూలుగా లేదు. హిందీ బిగ్ బాస్ కంటే కూడా అధికంగా తెలుగు బిగ్ బాస్ కు ఆధరణ ఉంది. అందుకే నిర్వాహకులు ఆ ఆధరణ ను మరింత క్యాష్ చేసుకునే ఉద్దేశ్యంతో బిగ్ బాస్ ఓటీటీ ని మొదలు పెట్టేందుకు సిద్దం అయ్యారు. బిగ్ బాస్ ఓటీటీ తెలుగు సీజన్ 1 ను ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. కరోనా వల్ల ఓటీటీ బిగ్ బాస్ ఆలస్యం అవుతుందేమో అంటూ అంతా అనుకున్నారు. కాని సైలెంట్ గా బిగ్ బాస్ ఓటీటీ పనులు జరిగి పోతున్నాయి.
సైలెంట్ గా ప్రముఖ దర్శకుడు బిగ్‌బాస్ ఓటీటీ కోసం ప్రోమోను రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేయించిన సెట్ లో షూట్ చేశాడు. దాదాపు వారం రోజుల పాటు షూటింగ్ చేయగా అందులో మూడు రోజుల పాటు నాగార్జున కూడా పాల్గొన్నాడట. రెండు మూడు ప్రోమోలను ఈ షెడ్యూల్ లో షూట్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ప్రోమోల షూటింగ్ కోసం కాస్త ఎక్కువ ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో రెగ్యులర్ బిగ్ బాస్ తో పోల్చితే ఈ బిగ్ బాస్ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతూ ప్రత్యేకంగా ఉంటుంది కనుక ప్రోమో కూడా చాలా స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు. ఆ దర్శకుడు చాలా క్రియేటివిటీతో హిందీలో వచ్చిన ఓటీటీ ని దృష్టిలో పెట్టుకుని ప్రోమోను షూట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.నాగార్జున బిగ్ బాస్ ఓటీటీ ప్రోమో షూటింగ్ లో పాల్గొన్నాడు. షూటింగ్ పూర్తి అవ్వడంతో వచ్చే వారంలో దుబాయి కి తన ది ఘోస్ట్ సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్లబోతున్నాడు.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ది ఘోస్ట్ సినిమా షూటింగ్ దుబాయి షెడ్యూల్ తో కీలక సన్నివేశాలు పూర్తి అవుతాయి. తద్వారా సినిమా చివరి షెడ్యూల్ మిగిలి ఉంటుంది. అది మార్చి నెలలో షూటింగ్ చేస్తారని సమాచారం అందుతోంది. సమ్మర్ లో విడుదల చేయడం లక్ష్యంగా ది ఘోస్ట్ సినిమా షూటింగ్ ను హడావుడిగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వైపు బిగ్ బాస్ ఓటీటీ కి హోస్టింగ్ చేస్తూనే మరో వైపు ది ఘోస్ట్ చివరి షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే నాగార్జున చేయబోతున్నాడు. బిగ్ బాస్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో దుబాయి షెడ్యూల్ ను ముందే ముగించేలా ప్లాన్ చేశారు. నాగార్జున ఓటీటీ బిగ్ బాస్ ను ఎలా డీల్ చేస్తాడో చూడాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.