
Tollywood suman gave 117 acres of land to indian army
Suman : టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్..కు సంబంధించిన వార్త ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వార్త ప్రకారం.. సుమన్ భారత సైన్యానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 117 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ వార్తపై హీరో సుమన్ క్లారిటీనిచ్చారు.సోషల్ మీడియాలో ఈ వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో సుమన్ స్వయంగా స్పందించి వివరణ ఇచ్చారు. తాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా భారత ఆర్మీకి 117 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చానని వస్తున్న వార్తల్లో నిజం లేదని సుమన్ పేర్కొన్నారు. ఆ వార్తలు పూర్తిగా అబద్ధమని, వాటిని నమ్మొద్దని చెప్పారు.
వాస్తవానికి సదరు భూమికి సంబంధించిన వివాదం ఇంకా కోర్టులోనే నడుస్తుందని వివరించారు. ఈ నేపథ్యంలో అటువంటి అసత్య వార్తలను ఎవరూ నమ్మొద్దని సూచించారు.ఇకపోతే భూమికి సంబంధించిన ఆ వివాదం పరిష్కారం అవగానే దానికి సంబంధించిన పూర్తి వివరాలను తానే స్వయంగా మీడియా ద్వారా చెప్తానని హీరో సుమన్ స్పష్టం చేశారు. ఇకపోతే హీరో సుమన్.. పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి అందరికీ విదితమే. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో నటించిన సుమన్.. విలన్ రోల్ ప్లే చేసి కూడా సక్సెస్ అయ్యారు.
Tollywood suman gave 117 acres of land to indian army
తమిళ్ తలైవా , సూపర్ స్టార్ రజనీకాంత్ ‘శివాజీ’ చిత్రంలో సుమన్ ప్రతి కథానాయకుడి పాత్రను అత్యద్భుతంగా పోషించి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. సుమన్ తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘రామ్ అసుర్’ఫిల్మ్ లో కనిపించారు. ‘తెలంగాణ దేవుడు’ చిత్రంలోనూ సుమన్ కీలక పాత్ర పోషించారు. ఈ పిక్చర్ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బయోపిక్. కాగా, ఇందులో లీడ్ రోల్ టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ ప్లే చేశారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.