Nagarjuna : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హీరో అక్కినేని నాగార్జునకు ఉన్న క్రేజ్ వేరు. అక్కినేని నాగేశ్వరావు గారు తనయుడిగా ఎంట్రీ ఇచ్చి… అనతి కాలంలోనే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను మన తెలుగు తెర కు అందించారు. నేటికీ తనదైన స్టైల్లో సినిమాలు చేస్తూ..టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. వయసు పెరిగిపోతున్నా.. ఇప్పటికి యంగ్ లుక్ లో కనిపిస్తూ తన కొడుకులకు సైతం పోటీ ఇస్తూ సినిమాల పరంగా దూసుకుపోతున్నాడు ఈ మన్మధుడు. ఇదిలా ఉండగా నాగార్జున ఓ సినిమా షూటింగ్ కారణంగా మద్యానికి బానిస అయ్యాడట. ఆ సినిమా పూర్తయిన చాలా కాలం వరకు తనకు ఆ అలవాటు కొనసాగిందట.
ఈ అంశం గురించి నాగ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.ఫిట్ నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటూ రోజు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉండే నాగార్జున.. ఓ సినిమా కారణంగా తాగుడు కి అలవాటు పడ్డారట. గతంలో నాగార్జున మల్టీ స్టారర్ మూవీగా నాచురల్ స్టార్ నాని తో కలిసి దేవదాస్ అనే సినిమాలో నటించారు. ఇందులో నాగార్జున ఎప్పుడు తాగుతూ ఉండే దేవ అనే పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఆ పాత్ర సరిగా పండాలని నాగ్.. రోజూ సాయంత్రం ఓ 2 పెగ్గులు వేసి సెట్ కు వచ్చేవారట. అలా అలవాటు అయిన ఆ తాగుడు..
తనను చాలా కాలం పాటు వదిలి వెళ్లలేదని ఆయనే స్వయంగా చెప్పారు. అయితే ఎంతో కష్టపడి తాను అందులోనుంచి బయటపడి మళ్లీ యదా స్థితికి వచ్చినట్లు ఆయన వివరించారు.వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. నాని, నాగార్జున ఈ సినిమాలో చేసిన కామెడీ భలే ఉంటుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 ను పూర్తి చేసుకున్న నాగార్జున త్వరలో.. ఘోస్ట్, బంగార్రాజు వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.