Nagarjuna: ఇప్పుడు అయితే చెప్ప‌లేను కాని, భ‌విష్య‌త్‌లో ఆలోచిస్తా.. నాగార్జున స్ట‌న్నింగ్ కామెంట్స్

Authored By Sam C | The Telugu News | Updated on : 17 January 2022, 3:00 pm

Nagarjuna : వరుస ఫ్లాపుల‌తో ఇబ్బంది ప‌డుతున్న నాగార్జున‌కి బంగార్రాజు మూవీ రూపంలో మంచి హిట్ ద‌క్కింది. సంక్రాంతికి విడుదలైన ఏకైక పెద్ద సినిమా, అలాగే గ్రామీణ నేపథ్యానికి సంబంధించిన స్టోరీ కావడం ‘బంగర్రాజు’కు బాగా కలిసొచ్చింది. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగచైతన్య సరసన కృతిశెట్టి నటించారు. ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గ‌ర వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తుంది. మొత్తంగా రెండు రోజుల్లో రూ. 36 కోట్లు వసూళ్లు చేసినట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది. దీనికి సంబంధించిన స్పెషల్‌ పోస్టర్‌ని కూడా విడుదల చేసింది.

2016 సంక్రాంతి కానుక రిలీజైన సోగ్గాడే చిన్నినాయన సినిమాకి సీక్వెల్‌గా తెర‌కెకెక్కిన బంగార్రాజు సినిమా మూడో రోజు కూడా అదే కంటిన్యూ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. దీంతో మీడియాతో మాట్లాడిన నాగార్జున..సినిమా సక్సెస్ అవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేసాడు. బంగార్రాజు సినిమాకి కూడా సీక్వెల్ వస్తుందా అని అడగ్గా.. ఆయన రాదు అని చెప్పలేం కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటూ హింట్ ఇచ్చాడు.సోగ్గాడే చిన్నినాయన సినిమా ఎక్కడ ఆగిపోయిందో.. బంగార్రాజు అక్కడే మొదలయ్యింది.

nagarjuna comments on bangarraju sequel

nagarjuna comments on bangarraju sequel

Nagarjuna : త‌ర్వాత ఆలోచిస్తాన‌న్న నాగార్జున‌

బంగార్రాజులో ఒక నాగార్జున క్యారెక్టర్‌కు కొడుకుగా, మరో నాగార్జున క్యారెక్టర్‌కు మనవడిగా ఆకట్టుకున్నాడు నాగచైతన్య. ఇంతకు ముందు ఈ తండ్రీకొడుకులు కలిసి ‘మనం’ చిత్రంలో నటించారు. మరోసారి వీరిద్దరి స్క్రీన్ ప్రెసెన్స్.. బంగార్రాజుకు పెద్ద ప్లస్‌గా మారింది. ఈ సినిమాలో ముగింపులో చూపిన‌ట్లుగా మ‌రో సినిమాకూడా తీయ‌వ‌చ్చు. ద‌ర్శ‌కుడు ఓ క్లూ కూడా ఇచ్చాడు. ప్ర‌తి 24 ఏళ్ళ‌కు శివాల‌యంలో హోమం చేయాల‌ని.. కానీ ఇప్పుడ‌ప్పుడే సినిమా చేయలేం. ఆలోచించి అన్నీ అనుకూలిస్తే అప్పుడు చూద్దాం అని తెలిపారు నాగార్జున.

 

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp