Nagarjuna : సీఏం జగన్ కు మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టం.. నాగార్జున | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nagarjuna : సీఏం జగన్ కు మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టం.. నాగార్జున

 Authored By prabhas | The Telugu News | Updated on :13 January 2022,3:15 pm

Nagarjuna  : ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై మెగాస్టార్ చిరంజీవి సీఏం జగన్ తో భేటీ అయిన అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ కలిసి ఏయే అంశాలపై చర్చిస్తారు..? ఈ చర్చలు ఎలాంటి ఫలితాలు తీసుకొస్తాయోనని సినీ ఇండస్ట్రీ అంతా ఎదురు చూస్తోంది. తాను సినీ ఇండస్ట్రీ బిడ్డగా.. సీఎం ఆహ్వానం మేరకే ఆయనను కలవడానికి వచ్చానని చిరంజీవి చెప్పుకురాగా.. ఈ భేటీపై హీరో నాగార్జున కీలక వ్యాఖ్యలు చేసారు.

ఇప్పుడీ వ్యాఖ్యలు ఆ ఇరువురి భేటీపై మరింత ఆసక్తిని రేపుతున్నాయి.చిరంజీవి ఇలా సమావేశానికి వెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పగా.. సీఎంతో సమావేశానికి వెళ్లమని తాను కూడా సలహా ఇచ్చానని ఆయన చెప్పారు. అయితే తన సినిమా విడుదల ప్రమోషన్స్ కారణంగా తాను ఆ మీటింగ్ కు వెళ్లలేదని వివరించారు. టిక్కెట్ల ధరల ప్రభావం తన సినిమాకు ఉండదని మాత్రమే తాను చెప్పానని మరోసారి స్పష్టం చేశారు.

Nagarjuna comments on cm Jagan and Chiranjeevi meeting over tickets disputes

Nagarjuna comments on cm Jagan and Chiranjeevi meeting over tickets disputes

సీఎం జగన్ కు చిరంజీవి అంటే ఇష్టమని చెప్పుకొచ్చిన నాగ్..సమస్యలన్నీ త్వరలోనే సమసిపోతాయని అన్నారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య చర్చలు జరుగుతుండగా.. మరికాసేపట్లో ఇందుకు సంబంధించి అప్డేట్ రావాల్సి ఉంది. ఈ భేటీ అయినా ఏపీలో సినిమా టికెట్ల వివాదానికి ముగింపు పలుకుంతుందో లేదో వేచి చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది