Home » Entertainment » Nagarjuna Concentrates On Sons
Entertainment

Nagarjuna : ఆ రెండు జ‌రిగితే నాగార్జున అంత అదృష్ట‌వంతుడు మ‌రొక‌రు ఉండ‌రేమో..!

Authored By
Sam C
The Telugu News | Published on: January 14, 2022, 8:30 pm
Advertisement

Nagarjuna : టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌ముఖ కుటుంబం అక్కినేని కుటుంబం.అక్కినేని నాగేశ్వ‌రరావు వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తండ్రి పేరు నిల‌బెట్టాడు. ల‌వ‌ర్ బోయ్ గా, మ‌న్మ‌థుడిగా, అన్న‌మ‌య్య‌గా ఇలా ఎన్నో ర‌కాల పాత్ర‌ల‌తో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందాడు. ఇప్పుడు ఆయ‌న త‌న‌యులు నాగ చైత‌న్య‌, అఖిల్ అలాంటి పేరు ప్ర‌ఖ్యాత‌ల కోసం ఎంత‌గానో క‌ష్ట‌ప‌డుతున్నారు. నాగ చైతన్య స్లో అండ్ స్ట‌డీగా సినిమాలు చేసుకుంటూ పోతుండ‌గా, అఖిల్ మాత్రం వ‌రుస ఫ్లాపుల‌ని చ‌వి చూస్తున్నాడు.

Advertisement

అఖిల్ రీసెంట్‌గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రంతో ఓ మోస్త‌రు విజ‌యాన్ని అందుకున్నాడు. ఈ విజ‌యంతో అఖిల్ కి కాస్త జోష్ వ‌చ్చింది. ఏజెంట్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ కోసం అఖిల్ బాగానే క‌ష్ట‌ప‌డుతున్నాడు. కండ‌లు పెంచి నానా ర‌చ్చ చేస్తున్నాడు. ఇక నాగ చైత‌న్య విష‌యానికి వ‌స్తే బంగార్రాజు కోసం తొలిసారి మాస్ హీరోగా మారాడు. ఇందులో చైతూ ప‌ర్‌ఫార్మెన్స్ ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ దగ్గ భారీ విజయాని నమోదు చేస్తే మాత్రం చైతూ పేరు మారు మ్రోగ‌డం ఖాయం.

nagarjuna concentrates on sons

Advertisement

Nagarjuna : నాగార్జున బ‌రువు త‌గ్గిన‌ట్టేనా?

చైతన్య న‌టించిన బంగార్రాజు సినిమా దాదాపు హిట్ అనే చెప్పాలి. ఆయ‌న న‌టిస్తున్న థ్యాంక్యూ చిత్రం కూడా మంచి స‌క్సెస్ సాధిస్తే ఇక చైతూ జోరుకి అడ్డు లేద‌నే చెప్పాలి. మ‌రో వైపు అఖిల్ ఏజెంట్ సినిమా కూడా హిట్ అయితే నాగార్జున కొడుకుల భవిష్యతు గురించి ఆలోచించనక్కర్లేదు. ఆయ‌న ప్ర‌శాంతంగా త‌న సినిమాలు చేసుకుంటూ వెళ్లొచ్చు. మ‌రో వైపు నాగార్జున త్వ‌ర‌లోనే చిన్న‌కొడుక్కి పెళ్లి చేయ‌బోతున్న‌ట్టు ప్రచారం న‌డుస్తుంది. ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి