
Nagarjuna cried for those amala words
Nagarjuna : టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్‌లో స్పెషల్ కపుల్ అక్కినేని నాగార్జున, అమల అని చెప్పొచ్చు. అమలను నాగార్జున సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ వీరిరువురు చాలా ప్రేమగా ఉంటారు. ఇక అక్కినేని అమల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లికి ముందర స్టార్ హీరోయిన్‌గా పేరు, ప్రఖ్యాతలు సంపాదించినప్పటికీ మ్యారేజ్ తర్వాత ఆమె.. శక్తిమంతమైన మహిళగా తయారైంది. అక్కినేని వారి కోడలుగా ఆదర్శ గృహిణిగా తన బాధ్యతను నిర్వర్తిస్తోంది.అమల-నాగార్జున పెళ్లికి ముందర పలు చిత్రాల్లో హీరో హీరోయిన్స్‌గా నటించారు.
కాగా, అభిమానులందరి ఫేవరెట్ సాంగ్స్‌లో ‘హలో గురు.. ప్రేమ కోసమేనోయ్.. జీవితం’ ఉంది ఉంటుంది. ఇందులో నాగార్జున, అమల పర్ఫార్మెన్స్ సూపర్బ్‌గా ఉంటుంది. ఈ సంగతి అలా ఉంచితే.. అమలతో మ్యారేజ్ తర్వాత నాగార్జున హీరోగా, ప్రొడ్యూసర్‌గా, ఓ మీడియా పార్ట్‌నర్‌గా, హోస్ట్‌గా , స్టూడియో అధినేతగా ఇలా రకరకాల పాత్రలు పోషిస్తున్నారు. అమల కూడా గృహిణిగా ఉంటూనే ‘బ్లూక్రాస్ సంస్థ’ స్థాపించి జంతు సంరక్షణకు కృషి చేస్తోంది.అమల-నాగార్జునల తనయుడు అఖిల్ గురించి అందరికీ తెలుసు. అయితే, అఖిల్ పుట్టిన కొన్ని నెలల తర్వాత నాగార్జున అమలతో ఇలా అన్నాడట.
Nagarjuna cried for those amala words
మనకు ఒక్క బాబే కాదు..ఇంకో పాప ఉంటే బాగుండని అన్నాడట. ఆ మాటలు విన్న అమల నాగార్జునపై సీరియస్ అయిందట. తనకు ఒక్క కొడుకు కాదని, తనకు ఇద్దరు కొడుకులని అందట. తన పెద్ద కొడుకు నాగచైతన్య కాగా, రెండో కొడుకు అఖిల్ అని తెలిపింది అమల. ఆ మాటలు విన్న నాగార్జున కన్నీటి పర్యంతమయ్యాడట. నాగచైతన్యను ఇంత బాగా చూసుకునే అమ్మలా అమల దొరకడం అదృష్టమని భావించాడు. అమల నుంచి అస్సలు అలాంటి మాటలు ఊహించలేకపోయాడట టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున. తండ్రీ తనయులు నాగార్జున, నాగచైతన్య కలిసి ప్రస్తుతం ‘బంగార్రాజు’ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి సీక్వెల్.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.