Anushka shetty: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అనుష్క శెట్టిది సుధీర్గ ప్రయాణం. భూమిక భర్త భరత్ ఠాగూర్ వద్ద యోగా శిక్షణ తీసుకున్న అనుష్క శెట్టి ఆ తర్వాత సొంతగా యోగా క్లాసులు తీసుకునేది. ఆ సమయంలో పూరి జగన్నాథ్‌కి అనుష్క గురించి చెప్పారు. ఆ సమయంలో ఆయన నాగార్జున హీరోగా సూపర్ అనే సినిమా ప్లాన్ చేస్తున్నాడు. బాలీవుడ్ సినిమా ధూమ్ సినిమా ఇన్స్పిరేషన్‌గా చేసుకొని రాబరీ బ్యాక్‌డ్రాప్‌లో కథ సిద్దం చేసుకున్నాడు. ఇందులో నాగార్జునతో పాటు సోనూసూద్ కూడా నటించాడు. వీరితో పాటు బైక్ డ్రై చేయగలిగే అమ్మాయి కావాలి.
అనుష్కను చూసిన పూరి బ్లైండ్‌గా ఫిక్సై పోయాడు. ఆ సినిమానే సూపర్. ఆయేషా టాకియా మరొక హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. బైక్ రైడింగ్‌లో గానీ రాబరీ సీన్స్‌లో గానీ నాగార్జున, సోనూసూద్‌లతో కలిసి పోటీ పడి నటించింది అనుష్క. ఈ సినిమా తర్వాత నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. ఈ మధ్య కాస్త జోరు తగ్గింది కానీ లేదంటే అనుష్క క్రేజ్ మరే హీరోయిన్‌కి లేదనే చెప్పాలి. త్వరలో చంద్రముఖి సీక్వెల్‌లో లారెన్స్‌తో కలిసి నటించబోతోందని సమాచారం.
అయితే మొదటి సినిమా సూపర్ ఆడిషన్స్‌కి వచ్చినప్పుడు అంతా చాలా కొత్తగా ఉందట. నాగార్జున ప్రొడక్షన్ హౌజ్ అన్నపూర్ణ స్టూడియోలో అనుష్కకి మేకప్ టెస్ట్ జరిగింది. చాలామంది మోడల్స్ వచ్చారు. చిన్న చిన్న బట్టలు వేయించి ఫొటో షూట్ నిర్వహించారు. ఇది అనుష్కకి ఏమాత్రం ఇష్టం లేదట. అంత చిన్న బట్టల్లో తనని తాను చూసుకొని బోరున ఏడ్చేసిందట అనుష్క. పూరి జగన్నాథ్, నాగార్జునకి చెప్పి ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలోకి రానని చెప్పిందట. అనుష్క పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందని నాగార్జున పసిగట్టాడు. అందుకే నాగార్జున, పూరి జగన్నాథ్, అనుష్క ఫాదర్ సూపర్ సినిమా సక్సెస్ చూపించి ఇలాంటి సక్సెస్‌లు నువ్వు ఎన్నో చూడాలని చెప్పారట. ఆ తర్వాత తను నెమ్మదిగా ఇండస్ట్రీకి అలవాటుపడి..ఈ రోజు స్టార్ హీరోయిన్‌గా వెలుగుతోంది.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.