Anushka shetty: బోరుమని ఏడ్చినా అనుష్క శెట్టిని నాగార్జున వదలకపోవడానికి కారణం అదే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anushka shetty: బోరుమని ఏడ్చినా అనుష్క శెట్టిని నాగార్జున వదలకపోవడానికి కారణం అదే..!

 Authored By govind | The Telugu News | Updated on :27 September 2021,8:11 am

Anushka shetty: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అనుష్క శెట్టిది సుధీర్గ ప్రయాణం. భూమిక భర్త భరత్ ఠాగూర్ వద్ద యోగా శిక్షణ తీసుకున్న అనుష్క శెట్టి ఆ తర్వాత సొంతగా యోగా క్లాసులు తీసుకునేది. ఆ సమయంలో పూరి జగన్నాథ్‌కి అనుష్క గురించి చెప్పారు. ఆ సమయంలో ఆయన నాగార్జున హీరోగా సూపర్ అనే సినిమా ప్లాన్ చేస్తున్నాడు. బాలీవుడ్ సినిమా ధూమ్ సినిమా ఇన్స్పిరేషన్‌గా చేసుకొని రాబరీ బ్యాక్‌డ్రాప్‌లో కథ సిద్దం చేసుకున్నాడు. ఇందులో నాగార్జునతో పాటు సోనూసూద్ కూడా నటించాడు. వీరితో పాటు బైక్ డ్రై చేయగలిగే అమ్మాయి కావాలి.

nagarjuna didnot leave anushka shetty because of this

nagarjuna didnot leave anushka shetty because of this

అనుష్కను చూసిన పూరి బ్లైండ్‌గా ఫిక్సై పోయాడు. ఆ సినిమానే సూపర్. ఆయేషా టాకియా మరొక హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. బైక్ రైడింగ్‌లో గానీ రాబరీ సీన్స్‌లో గానీ నాగార్జున, సోనూసూద్‌లతో కలిసి పోటీ పడి నటించింది అనుష్క. ఈ సినిమా తర్వాత నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. ఈ మధ్య కాస్త జోరు తగ్గింది కానీ లేదంటే అనుష్క క్రేజ్ మరే హీరోయిన్‌కి లేదనే చెప్పాలి. త్వరలో చంద్రముఖి సీక్వెల్‌లో లారెన్స్‌తో కలిసి నటించబోతోందని సమాచారం.

Anushka shetty: చిన్న బట్టల్లో తనని తాను చూసుకొని బోరున ఏడ్చేసిందట అనుష్క.

అయితే మొదటి సినిమా సూపర్ ఆడిషన్స్‌కి వచ్చినప్పుడు అంతా చాలా కొత్తగా ఉందట. నాగార్జున ప్రొడక్షన్ హౌజ్ అన్నపూర్ణ స్టూడియోలో అనుష్కకి మేకప్ టెస్ట్ జరిగింది. చాలామంది మోడల్స్ వచ్చారు. చిన్న చిన్న బట్టలు వేయించి ఫొటో షూట్ నిర్వహించారు. ఇది అనుష్కకి ఏమాత్రం ఇష్టం లేదట. అంత చిన్న బట్టల్లో తనని తాను చూసుకొని బోరున ఏడ్చేసిందట అనుష్క. పూరి జగన్నాథ్, నాగార్జునకి చెప్పి ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలోకి రానని చెప్పిందట. అనుష్క పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందని నాగార్జున పసిగట్టాడు. అందుకే నాగార్జున, పూరి జగన్నాథ్, అనుష్క ఫాదర్ సూపర్ సినిమా సక్సెస్ చూపించి ఇలాంటి సక్సెస్‌లు నువ్వు ఎన్నో చూడాలని చెప్పారట. ఆ తర్వాత తను నెమ్మదిగా ఇండస్ట్రీకి అలవాటుపడి..ఈ రోజు స్టార్ హీరోయిన్‌గా వెలుగుతోంది.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది