Karthika Deepam 27 Sep Today Episode : కార్తీక దీపం సీరియల్ 27 సెప్టెంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 1155 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీప.. ఇంకా ఆ మోనిత విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. వారణాసి చెప్పిన మాటలకు బాగా డిస్టర్బ్ అవుతుంది దీప. ఇంతలో తనకు ఒంటరిగా హిమ కనిపిస్తుంది. హిమ కూడా బాధపడుతూ ఉంటుంది. ఏమైందమ్మా.. కన్నీళ్లు ఏంటి అని అడుగుతుంది. ఏమీ లేదమ్మా అంటుంది. కన్నీళ్లు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో దీనితో ఇదే చిక్కు.. ఊరికే అలుగుతుంది. ఏం అడిగినా చెప్పదు.. చిన్నమాట అన్నా పడదు. అభిమానం.. ఎక్కువ అని అనుకుంటుంది దీప.
కట్ చేస్తే.. మోనిత జైలు గదిలో కూర్చొని కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి కార్తీక్ జైలుకు వెళ్లింది.. ప్రేమ లేదు గీమ లేదు అని అనుకుంటున్నావా? జైలుకు వచ్చాక ప్రేమ రెట్టింపు అయింది నీ మీద. మన బిడ్డ పెరుగుతున్నా కొద్దీ నీ ప్రేమ ప్రేమ పెరుగుతూనే ఉంటుంది కార్తీక్.. అని అనుకుంటుంది మోనిత.
ప్రపంచం నాగురించి ఏమన్నా అనుకున్నా నేను పట్టించుకోను దీప. కానీ.. నా పిల్లలు నన్ను అపార్థం చేసుకుంటే మాత్రం నేను తట్టుకోలేను. మాట్లాడవేంటి దీప.. అని అడుగుతాడు కార్తీక్. అప్పటి దాకా బాగానే ఉన్నారు అంతలోనే ఏమైంది వాళ్లకు అంటాడు. డాక్టర్ బాబు కాస్త సమయం పడితే అన్నీ సర్దుకుంటాయి. ఇందకా వారణాసి బస్తీలో ఏం జరిగిందో చెప్పాను కదా.. అంటే బస్తీలో ఏమనుకుంటే మనకెందుకు అనగానే.. బస్తీలాగానే అంతటా జనాలు ఉంటారు డాక్టర్ బాబు. ఎవరో పిల్లలకు ఏదో చెప్పి ఉంటారు.. అందుకే పిల్లలు అలా ప్రవర్తిస్తున్నారు.. అనగానే ఇప్పుడు వాళ్ల మనసులో ఏముందో తెలుసుకోవడం ఎలా? వాళ్లకు ఏం చెబితే అర్థం చేసుకుంటారు అనగానే నిజం చెప్పాలి డాక్టర్ బాబు.. ఏంటి దీప.. నీ ఉద్దేశం పిల్లలకు నిజం చెప్పి నన్ను విలన్ చేద్దామనా అంటాడు కార్తీక్.
నిజం చెప్పాలంటే మొదటి నుంచి మొదలు పెట్టాలి దీప. అన్నీ చెప్పాలి.. అంటాడు. చెప్పండి డాక్టర్ బాబు.. అబద్ధం చెప్పడం కన్నా.. నిజం చెప్పి బరువు దించుకోవడం బెటర్ అంటుంది దీప. అలా అని నిజం చెప్తే.. దాన్ని వాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని అంటాడు కార్తీక్. వాళ్లను నిజం చెబితే ఎలా అర్థం చేసుకుంటారు అనేది పక్కన పెడితే ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు చెబుతూ బతుకుదాం. ఇకనైనా నిజం చెప్పేద్దాం. మన గురించి ఇంకెవరో నిజాలు చెప్పేముందే మనమే నిజం చెప్పేద్దాం.. అంటుంది. దీంతో స్టాపిట్ దీప.. నీకు దండం పెడతాను. నేనే చేసిన తప్పేమీ లేదు. నిజం నిజం అంటూ ఆ మోనిత గురించి చెబితే బాగుండదు. పిల్లల మనసులు బాగుపడతాయి. ఒక డాక్టర్ గా పేషెంట్స్ ఒక్కోసారి నిజం కనా అబద్ధంగానే పనిచేస్తాయి దీప.. అని అనగానే సౌందర్య.. ఇద్దరు పిల్లలను తీసుకొని వస్తుంది.
ఏంటే.. మీ నాన్న ఏం చేశాడని తనతో మీరు మాట్లాడటం లేదు. ఏంటి ఈ ఓవర్ యాక్షన్లు అని సీరియస్ గా అడుగుతుంది సౌందర్య. ఏదైనా మనసులో ఉంటే ఎదురుగానే ఉన్నాడు కదా అడగండి.. అని అంటుంది. ఈ భూమి మీద మాట్లాడే జీవులు అతి తక్కువగా ఉన్నాయి. మనిషికి మాట దేవుడు ఇచ్చిన వరం. ఇలా మౌనంగా ఉండకండి.. అసలు ఏం జరిగిందో చెప్పండి.. అని అంటుంది సౌందర్య.
దీంతో హిమ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏడ్వకు హిమ.. ప్లీజ్ హిమ. నువ్వు ఏడ్వకు అని శౌర్య అంటుంది. ఏడ్చినా.. బాధపడ్డా ఊరికే నీకు జ్వరం వస్తుంది.. అనగానే వీళ్లు నిజం చెప్పరు. మనం ఎన్నిసార్లు అడిగినా ప్రతిసారీ ఒక కొత్త అబద్ధం చెబుతారు అంటుంది హిమ. దీంతో అసలు ఏమైంది మీకు. ఏం కావాలి మీకు.. మీ నాన్నతో మాట్లాడండి.. అంటుంది దీప. ఏమైంది బంగారం.. ఏమైందమ్మా.. ఎవరైనా నిన్ను ఏమన్నా అన్నారా అని అడుగుతాడు కార్తీక్.
దీంతో అన్నారు డాడీ.. అనగానే ఏమన్నారు అని అడుగుతాడు. నన్ను కాదు డాడీ నిన్ను అన్నారు అంటాడు. ఏమన్నారు అనగానే.. నీ గురించి, మోనిత ఆంటి గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడారు డాడీ మా స్కూల్ లో అంటుంది హిమ. మీరిద్దరూ ఫ్రెండ్స్ కాదంట కదా. మీ ఇద్దరి మధ్య ఇంకేదో ఉందని అంటున్నారు. ఏదేదో అంటున్నారు నాన్నా. ఏంటి నాన్నా ఇది. మా ముందు నిన్ను అలా అంటుంటే మేము ఎలా తట్టుకోగలం. హిమ నాకన్నా సెన్సిటివ్. చూడు పాపం తను ఎలా ఫీల్ అవుతుందో.. అని అంటుంది శౌర్య.
తెలిసో తెలియకో బయటివాళ్లు ఏదో ఒకటి అంటుంటారు. అవన్నీ పట్టించుకుంటారా… అని అంటుంది సౌందర్య. దీంతో నువ్వుండు నానమ్మా.. ఎవరు చెప్పేది నిజమో అబద్ధమో తెలియట్లేదు అంటుంది శౌర్య. అదంతా అయిపోయింది అనగానే ఏం అయిపోయింది నానమ్మా.. ఏమీ కాలేదు. మీరేదో నాదగ్గర దాస్తున్నారు. అది అర్థం అవుతోంది. ఒకసారి నాన్న జైలులో ఉన్నప్పుడు తాతయ్యతో మాట్లాడుతూ… మోనిత కనిపిస్తే.. నాన్న బయటికి వస్తాడు అన్నావు.. అన్నావా లేదా.. అని అడుగుతుంది శౌర్య. అసలు మోనిత ఆంటి ఎక్కడికి వెళ్లింది. ఆమె కనిపించకపోతే నాన్నకు సంబంధం ఏంటి. నువ్వేమో మోనిత ఆంటీ కనిపిస్తే డాడీ బయటికి వస్తాడు అన్నావు. అమ్మేమో అదేదో ఆపరేషన్ ఫెయిల్ అయిందని చెప్పింది. మీరిద్దరూ తలోరకంగా చెప్పారంటే ఈ రెండూ అబద్ధాలే కదా. అసలు నిజం ఏంటి మరి.. అనగానే నిజం అడిగితే మరో అబద్ధం చెబుతారు శౌర్య. వీళ్లను నిజం అడగొద్దు అంటుంది హిమ.
మీరు అబద్ధాలు చెప్పి మా నోర్లు ఎందుకు మూయిస్తున్నారు. మీరు తలా ఒక విధంగా చెప్పారంటే అది అబద్ధం అయినట్టే కదా.. అంటుంది. మోనిత ఆంటి అప్పుడు ఒక ఆపరేషన్ చేస్తుంటే పేషెంట్ బాడీ హార్ట్ ఫెయిల్ అయింది. పేషెంట్ చనిపోయాడని భయపడి మోనిత పారిపోయింది. మీ నాన్న జరిగిందంతా నిజం చెప్పారు. మోనిత ఆంటీ ఎందుకు పారిపోయిందని పోలీసులకు డౌట్ వచ్చి మీ నాన్నను జైలులో పెట్టారు. అప్పుడు మోనిత ఆంటీ కనిపిస్తేనే నాన్న జైలు నుంచి బయటికి వస్తారు కదా. అదే విషయం నానమ్మ చెప్పింది. మోనిత ఆంటీ భయం పోయి బయటికి వచ్చింది.. అని చెబుతుంది దీప. ఏంటి ఇంకా అర్థం కాలేదా.. సరే.. ఇంకా అర్థం అయ్యేలా చెబుతాను విను. స్కూల్ లో నీ ఫ్రెండ్ ఓ పెన్ కొట్టేసిందనుకో. నీ ఫ్రెండ్ పక్కన నువ్వు ఉన్నావనుకో. పెన్ను కొట్టేసిన తర్వాత నీ ఫ్రెండ్ పారిపోతే.. నువ్వు అక్కడే ఉంటే వచ్చి నిన్నే అడుగుతారు కదా. అవును అంటుంది శౌర్య. సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది. నేను వెళ్లి మోనిత ఆంటీకి చెప్పి నేను తీసుకొచ్చాను.. అని చెబుతుంది దీప. మీ నాన్న జైలులో ఉన్నప్పుడు కూడా తన కోసం ఎప్పుడూ బాధపడలేదు. అయ్యో.. నా గురించి నా పిల్లలు ఎంత ఏడుస్తున్నారో.. ఎంత బాధపడుతున్నారో.. తిన్నారో లేదో అని నీకోసమే తపించి పోయారు. ఇప్పుడు ఎవరో ఏదో అన్నారని మీరు మీ నాన్నను బాధపెడుతున్నారా.. అంటూ దీప చెబుతుంది.
ఆయన్నే మీరు ప్రశ్నిస్తారా.. ఆయన మీకు ప్రేమను పంచితే.. ఆయన్ను మీరు మీ మాటలతో శిక్షిస్తారా.. అంటుంది. నా దీప. నా బిడ్డకు తండ్రి అతడే.. ఓ డాక్టర్ వింత ప్రేమ కథ.. అంటూ పేపర్ లో రాయిస్తుంది మోనిత. పేపర్ లోని వార్తను చూసి కార్తీక్ షాక్ అవుతాడు. అప్పుడే ఆ పేపర్ ను తీసుకొని శౌర్య చదువుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయట్ చేయాల్సిందే.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.