Nagarjuna : బ్ర‌హ్మానందంతో ఆ స‌మ‌స్య ఉంది.. అందుకే తీసుకోలేద‌ని చెప్పిన నాగార్జున‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nagarjuna : బ్ర‌హ్మానందంతో ఆ స‌మ‌స్య ఉంది.. అందుకే తీసుకోలేద‌ని చెప్పిన నాగార్జున‌

 Authored By sandeep | The Telugu News | Updated on :23 January 2022,10:10 am

Nagarjuna: వ‌రుస ఫ్లాపుల‌తో ఇబ్బంది ప‌డుతున్న‌నాగార్జున..బంగార్రాజు చిత్రంతో బాక్సాఫీస్ దగ్గ‌ర పెద్ద విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ విజ‌యం నాగార్జున‌కి మ‌రింత జోష్‌ని క‌లిగించింది. సంక్రాంతికి రావాల్సిన పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో ‘బంగార్రాజు’ చిత్రానికి కలిసొచ్చింది. ఇక 6 యేళ్ల క్రితం విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీకి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందించ‌డంతో పాటు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్స్ వ‌ర్షం కురిపించింది.

nagarjuna  : బ్ర‌హ్మీని వ‌ద్ద‌నుకున్నాం..

గ‌త కొద్ది రోజులుగా సినిమా ప్ర‌మోష‌న్‌లో పాల్గొంటున్న నాగార్జున ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేస్తున్నారు. సోగ్గాడే చిన్నినాయనా కథ జరిగిన ముప్పై సంవత్సరాల తర్వాత కథగా బంగార్రాజు చిత్రాన్ని చూపించామని అన్నారు. ఇది తాత, మనవడి కథ.. ముప్పై ఏళ్ల తర్వాత జరిగే కథలో బ్రహ్మానందంని చూపిస్తే ఓ 80 ఏళ్ల వయసున్న వ్యక్తిగా చూపించాల్సి వస్తుంది.. అదో పెద్ద స్టోరీ అవుతుంది. అందుకే బంగార్రాజులో బ్రహ్మానందం పాత్రని పెట్టలేదని చెప్పుకొచ్చారు.

nagarjuna about lack of brahmanandam character

nagarjuna about lack of brahmanandam character

సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో బ్రహ్మానందం ఆత్మానందస్వామిగా నటించి మెప్పించారు. బంగార్రాజు లో నాగార్జునకు జోడీగా ర‌మ్య‌కృష్ణ న‌టించారు. ఈ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చింది. అన్న‌పూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మించాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. నాగచైత‌న్య స‌ర‌స‌న ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి న‌టించారు. అన్న‌పూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మించాయి.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది