Nagarjuna : అనుకోకుండా బిగ్ బాస్ 5 విన్నర్ ఎవరో చెప్పిసిన నాగార్జున.. ?

Authored By mallesh | The Telugu News | Published on: December 18, 2021, 6:20 pm

Nagarjuna : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ చివరి దశకు చేరింది. ఈ క్రమంలోనే హౌజ్ నుంచి సిరి ఎలిమినేట్ అయింది. దాంతో మిగిలిన వారిలో ‘బిగ్ బాస్’ టైటిల్ గెలుచుకుని విజేతగా నిలచేది ఎవరు అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. కాగా, బిగ్ బాస్ గురించి ‘బ్రహ్మాస్త్ర’ ఫిల్మ్ ఈవెంట్‌లో నాగార్జున మాట్లాడారు. ఇంతకీ నాగార్జున ఏం మాట్లాడారంటే..బాలీవుడ్ విజ్యువల్ వండర్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ రణ్ బీర్ కపూర్, నాగార్జున, ఆలియాభట్, అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో నటిస్తున్నారు.

కాగా, ఈ సినిమా మోషన్ పోస్టర్ లాంచింగ్ ఈవెంట్ హైదరాబాద్‌లో శనివారం జరిగింది. ఈ ఈవెంట్‌కు గెస్ట్‌గానే కాకుండా ‘బ్రహ్మాస్త్ర’ ఫిల్మ్ సౌత్ లాంగ్వేజెస్ ప్రజెంటర్‌గా ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి హాజరయ్యారు. ఇక ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ డైరెక్టర్. కాగా, ఈ సినిమా మూడు పార్ట్‌లు గా విడుదల కాబోతుంది. ‘బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్: శివ’ వచ్చే ఏడాది సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ భారీ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన నాగార్జున ‘బ్రహ్మాస్త్ర’ఈవెంట్‌లో ‘బిగ్ బాస్’ గురించి పొరపాటున మాట్లాడారు.

nagarjuna tongue slip about bigg boss 5 winner in brahmastra film event

nagarjuna tongue slip about bigg boss 5 winner in brahmastra film event

Nagarjuna : ఫైనల్‌గా ‘బిగ్ బాస్’ టైటిల్ గెలుచుకునేది ఎవరో..

విలేకరుల ప్రశ్నలకు సమాధానాలిస్తున్న క్రమంలో ‘బిగ్ బాస్’ ఫినాలే ఈవెంట్‌కు తాను వెళ్లాల్సి ఉందని కాబట్టి అనుమతించాలని కోరాడు. ఇక ఆ తర్వాత నాగార్జున వెళ్లిపోగా, ఈ వీడియో చూసిన నెటిజన్లు, బిగ్ బాస్ ప్రేక్షకులు విన్నర్ ఎవరో నాగార్జునకు తెలుసని కామెంట్స్ చేస్తున్నారు. సన్నీనే విన్నర్ అని కొందరు అభిప్రాయపడుతుండగా, షణ్ముక్ జస్వంత్ విన్నర్ అని మరికొందరు అంటున్నారు. మొత్తంగా ‘బిగ్ బాస్’ షో సీజన్ ఫైవ్ ఇక ముగిసిపోతున్నదనే సంకేతాలను ‘బ్రహ్మాస్త్ర’ ఫిల్మ్ ఈవెంట్‌లో ఇచ్చేశాడు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp