Nagarjuna : సమంత- నాగ చైతన్యల‌ని క‌లిపేందుకు నాగార్జున ప్ర‌య‌త్నిస్తున్నాడా?

Authored By Sam C | The Telugu News | Published on: May 16, 2022, 3:30 pm

Nagarjuna : టాలీవుడ్ క్యూట్ క‌పుల్ సమంత- నాగ చైతన్య తమ వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెడుతూ ఎప్పుడైతే విడాకుల ప్రకటన చేశారో అప్పటినుంచి వీరిద్దరి వ్యక్తిగత విషయాలపై ఎన్నో రూమర్స్ బయటకొచ్చాయి. అక్కినేని ఫ్యామిలీ కండీషన్స్, సమంత బిహేవియర్ అంటూ బోలెడన్ని పుకార్లు షికారు చేశాయి. అయితే ఇటు సమంత గానీ, అటు అక్కినేని ఫ్యామిలీ గానీ వీటన్నింటీ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్ప‌టికీ కూడా వీరిద్ద‌రి పెళ్లికి సంబంధించి ఏదో వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది. చైతూ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని, స‌మంత కూడా ఓ వ్య‌క్తిని వెతుక్కుంద‌ని ప్ర‌చారాలు న‌డుస్తూనే ఉన్నాయి.

తాజాగా నాగార్జున ఇద్ద‌రిని క‌లిపే ప్ర‌య‌త్నాలు చేయ‌బోతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.గుడ్ న్యూస్ చెప్ప‌నున్నారా..!ఇటీవలే నాగార్జున నేరుగా వెళ్లి మాజీ కోడలు సమంత నాన్న గారిని కలిసారట. సమంత – చైతన్య భవిష్యత్ బావుండాలని దానికోసం ఏదైనా చేయాలని ఆయనతో ముచ్చటించారని కొన్ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అక్కినేని కుటుంబంలో ఎంతో కలివిడిగా కలిసిపోయిన సమంత ఉన్నట్టుండి చైతన్యతో గొడవపడి విడిపోవడం ఎవరూ జీర్ణించుకోలేనిది. అయితే ఇప్పుడిలా కొత్త పుకార్ షికార్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. నిజంగానే నాగార్జున అలా కలిసారా? ఏదైనా ముచ్చటించారా? అన్నదానికి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

nagarjuna Trails for Samantha And Naga Chaitanya

nagarjuna Trails for Samantha And Naga Chaitanya

విడాగుల ప్రకటన తర్వాత ఇద్దరు వారి వారి ప్రాజెక్టుల్లో బిజీగా మారిపోయారు. విడాకులపై సోషల్​ మీడియాలో వచ్చిన కామెంట్స్​పై స్పందిస్తూ.. సమంతా అప్పుడప్పుడూ వార్తల్లో నిలిచారు. వరుస సినిమాలు ఓకే చేస్తూ కూడా అమె ఎప్పుడు వార్తల్లో ఉంటున్నారు. ఇక నాగ చైతన్య మాత్రం అడపా దడపా సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉండటం తప్పా.. మీడియా ముందు పెద్దగా రాలేదు. గతేడాది అక్టోబర్ నెలలో అక్కినేని సమంత, నాగ చైతన్య విడిపోతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. అప్పటినుంచి వేరువేరుగా ఉంటూ తమ తమ ప్రొఫెషనల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp