Nagarjuna : డేటింగ్‌కు ఓకే.. స్టేజీపైనే నాగార్జునకు సరయు ముద్దుల వర్షం..

Authored By mallesh | The Telugu News | Published on: December 20, 2021, 5:40 pm

Nagarjuna : టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునకు మహిళల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగార్జున ఆరు పదుల వయసులో ఉన్నప్పటికీ ఇంకా యూత్‌ను అట్రాక్ట్ చేస్తుంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తను హీరోగా సినిమాలు చేస్తూనే తనయుడితోనూ సినిమా చేస్తున్న నాగార్జున.. పాపులర్ రియలాటీ షో తెలుగు ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’కు హోస్ట్‌గా వ్యవహరించారు. సీజన్ ఫైవ్ ఆదివారం ముగియగా, గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌లో ఆసక్తికర సంఘటన జరిగింది.‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు నిర్వాహకులు.

ఈ ఫినాలే ఈవెంట్‌లో ‘బిగ్ బాస్’స్టేజీపైన టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ టీం సభ్యులు, ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి, బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రణ్ వీర్ సింగ్, హీరోయన్ ఆలియా భట్ కనిపించారు. ఇకపోతే ఈ స్టేజీపైన బోల్డ్ బ్యూటీ సరయు నాగార్జునతో మాట్లాడిన మాటలు ప్రజెంట్ వైరలవుతున్నాయి. బూతులు మాట్లాడి ఫేమస్ అయిన సరయు ‘బిగ్ బాస్’లోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయింది. నాగార్జునను డేట్‌కు రావాలని అడిగింది సరయు. నాగార్జున అంటే తనకు చాలా ఇష్టమని,

nagrjuna going to date sarayu suman soon

nagrjuna going to date sarayu suman soon

Nagarjuna : సరయు కోరికలకు ఓకే చెప్పిన నాగార్జున.. ఏమవుతుందో మరి..

ఈ సందర్భంలోనే తనతో డేట్‌కు రావాలని నాగార్జునను సరయు అడిగింది. సరయు అడిగిన వెంటనే నాగార్జున ఓకే చెప్పేశారు. ‘బిగ్ బాస్’ గ్రాండ్ ఫినాలే అయిపోయిన తర్వాత డేట్‌కు వెళ్దామని సరయుకు చెప్పాడు.దాంతో సరయు అనందంతో గంతేసింది. నాగార్జునపైన ముద్దుల వర్షం కురిపించింది. అయితే, ఈ విషయం తెలుసుకుని నెటిజన్లు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, డేటింగ్ టైంలోనూ నాగార్జునతో సరయు బూతులే మాట్లాడుతుందా? ఏంటని అడుగుతున్నారు. ‘సెవన్ ఆర్ట్స్’ పేరిట యూట్యూబ్ చానల్‌లో ఆమె చేసే వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp