Namrata Shirodkar : మరోసారి మంచి మనసు చాటుకున్న నమ్రత.. వారికి ఏ సాయం చేసిందంటే..!
ప్రధానాంశాలు:
Namrata Shirodkar : మరోసారి మంచి మనసు చాటుకున్న నమ్రత.. వారికి ఏ సాయం చేసిందంటే..!
Namrata Shirodkar : మహేష్ బాబు సతీమణి నమ్రత సాయంలో ముందు ఉంటుది. మహేష్ బాబు ఫౌండేషన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నమ్రతా శిరోద్కర్ ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్రా హాస్పిటల్స్‌లో మొట్టమొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించారు, ఇది నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణలో ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. అలానే పదేళ్ల కాలంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫౌండేషన్ఆధ్వర్యంలో 4,500 మంది పిల్లలకు పైగా గుండె ఆపరేషన్లు చేయించినట్లు నమ్రత శిరోడ్కర్ తెలిపారు.

Namrata Shirodkar : మరోసారి మంచి మనసు చాటుకున్న నమ్రత.. వారికి ఏ సాయం చేసిందంటే..!
Namrata Shirodkar మంచి మనసుతో..
చిన్నారుల విషయంలో మహేశ్ బాబు ఫౌండేషన్ సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు నమ్రత చెప్పుకొచ్చారు. తమకు సాధ్యమైనంత వరకూ ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని మహేశ్ బాబు సతీమణి పేర్కొన్నారు. ఇక తాజాగా నమ్రత పిల్లలకి షటిల్ బ్యాట్స్ అందించారు. విద్యార్ధులని ఎంతగానో ప్రోత్సహిస్తూ మంచి మనసు చాటుకున్నారు.
నమ్రత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మహేష్ బాబు భార్య కానే కాకుండా.. మిస్ ఇండియా గా ఫేమస్ హీరోయిన్ గా కూడా.. నమ్రత సుపరిచితురాలే. అలాంటి ఈ నటి ఈ మధ్య షేర్ చేసిన ఫోటోలు కొన్ని తెగ వైరల్ అవుతున్నాయి.