Home » Entertainment » Namrata Shirodkar Interesting Comments On Mahesh Babu Movies
Entertainment

Mahesh Babu : మహేష్ బాబు సినిమాలకు నాకు సంబంధం లేదు అంటూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసిన నమ్రత…!

Authored By
aruna
The Telugu News | Published on: August 12, 2022, 8:30 am
Advertisement

Mahesh Babu : నమ్రతా శిరోద్కర్ ఈమె ఒక టాలీవుడ్ హీరోయిన్. ఈ అమ్మడు 1993లో మిస్ ఇండియా గా ఎంపికైంది. ఈమె ఫస్ట్ రూపదర్శికగా పనిచేసింది. తర్వాత ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టింది. టాలీవుడ్ అగ్ర హీరో మహేష్ బాబుని ప్రేమించి వివాహం చేసుకుంది. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ మహేష్ బాబు, నమ్రత. అయితే ఈ అమ్మడు పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని ముందే డిసైడ్ అయిందట. ప్రస్తుతం ఆమె అదే ఫాలో అవుతుంది. ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటుంది.

Advertisement

ఇలా వారి జీవితం చాలా సంతోషంగా గడిచిపోతుంది. అయితే నమ్రత వారి పెళ్లి బంధంనాకి సంబందించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ… నా హస్బెండ్ లేకుండా ఎంతకాలమైనా నాలుగు గోడల మధ్య జీవించగలను. మా బంధం మధ్యలో ఇంకొక వ్యక్తి రాకుండా మేము చాలా సంతోషంగా ఉంటాం. మా మధ్య ఎటువంటి దాపరికాలు లాంటివి ఉండవు. నేను అంటే ఏమిటో నా భర్తకి పూర్తిగా తెలుసు. అదేవిధంగా నా భర్త అంటే ఏమిటో నాకు కూడా పూర్తిగా తెలుసు. మా ఇద్దరి మధ్య అంత నమ్మకం ఉంటుంది. మా గురించి తెలుసుకోకుండా ఎవరోఏదో మాట్లాడేస్తూ ఉంటారు. అయితే చాలామంది నా భర్త నేను చెప్పినట్లే మూవీలను చేస్తూ ఉంటారని చాలా పుకార్లు నడిచాయి.

Namrata Shirodkar Interesting Comments on Mahesh Babu Movies

Advertisement

కానీ ఆ పుకార్లలో ఎటువంటి నిజం లేదు. ఎందుకనగా నా భర్తకి ఎలాంటి మూవీలు చేయాలో, ఎవరితో మూవీ చేయాలో అనే విషయంపై చాలా జాగ్రత్తగా ఉంటాడు. నా భర్త తీసుకున్న ఎటువంటి నిర్ణయమైనా సరే నేను అడ్డుపడను. ఆయనకి నచ్చినట్లుగా ఉండడానికి నేను ఓకే చెప్తాను. నేను ఏ రోజు ఎదురు ప్రశ్నించలేదు సినిమాల విషయంలో అని నమృత ఈ ఇంటర్వ్యూలో తెలియజేశారు. అదేవిధంగా మహేష్ బాబు మూవీలతో బిజీగా ఉండడం వలన నమ్రత ఇంటికి సంబంధించిన బాధ్యతలను అలాగే కొన్ని బిజినెస్లను చూసుకుంటుందట. ఇప్పటికీ ఇండస్ట్రీలోఎంతో క్రేజ్ ఉన్న ఆమె పెళ్లికి కట్టుబడి ఉండి ఇంటి బాధ్యతలను ,వారి పిల్లలను చూసుకుంటూ ఎంతో హ్యాపీగా జీవితాన్ని సాగిస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి