Jr NTR : ఎన్టీఆర్ పై అ** బూతులు… బాలయ్య ఫ్యాన్స్ మరీ శృతి మించారు
Jr NTR : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఇబ్బందుల్లోకి నెట్టేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ పేరును తొలగించడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు చాలా మందికి నచ్చడం లేదు. వైయస్ జగన్ కి భయపడి లేదంటే వైకాపాలో ఉన్న ఆయన స్నేహితుల ఒత్తిడి కారణంగా చాలా సున్నితంగా ఈ విషయంపై స్పందించాడు అంటూ చాలా మంది చాలా రకాలుగా చర్చించుకుంటున్నారు. ఇదే సమయంవైయస్ జగన్ల నందమూరి అభిమానులు తీవ్ర స్థాయిలో ఎన్టీఆర్ తీరును దూషిస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా విడుదల అయ్యి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున సినిమా రీ రిలీజ్ జరిగింది.
ఆ సందర్భంగా కొందరు ఈ విషయాన్ని లేవనెత్తి వివాదాన్ని రెచ్చగొట్టేలా ప్రయత్నించారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ అభిమానులు థియేటర్ల వద్ద ఎన్టీఆర్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రచ్చ చేసే ప్రయత్నం చేశారు. ఒకానొక థియేటర్ వద్ద ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ అభిమానుల మధ్య తోపులాట జరిగింది. ఎన్టీఆర్ ని అ** బూతులు తిడుతూ ఇష్టానుసారంగా బాలకృష్ణ అభిమానులు చేసిన ఓవరాక్షన్ కి ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర మనో వేదనకు గురవుతున్నారట. బాలకృష్ణ అభిమానులు ఎప్పుడూ కూడా ఎన్టీఆర్ ని తిడుతూనే ఉంటారు, ఆ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఈ మధ్య కాలంలో వారు శృతి మించి పోయారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఎన్టీఆర్ ని అత్యంత హీనంగా మాట్లాడుతున్నారు. ఏకంగా ఎన్టీఆర్ యొక్క ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ని కూడా వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు.
ఇది కరెక్ట్ కాదు.. నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్ ఒక సభ్యుడు అంటూ ఇప్పటికే ఆ కుటుంబ సభ్యుల్లో ఎక్కువ శాతం మంది అంగీకరించారు. అయినా కూడా కొందరు అభిమానులు ఇలా వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదు. ఎన్టీఆర్ ఒక గొప్ప నటుడు ఆయన ఇలాంటి వివాదాలకు దూరంగా ఉండటమే మంచిది. ఆ ఉద్దేశంతోనే తన తాత గారి యొక్క పేరును తొలగింపు పై పొడి పొడిగా స్పందించి ఉంటారు. అంతే కానీ తాతగారిపై అభిమానం లేక కాదు. ఫ్యామిలీ పై అభిమానం లేక కాదు అనే విషయాన్ని నందమూరి ఫ్యామిలీ యొక్క అభిమానులు గుర్తిస్తే బాగుంటుంది. నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ అంతా గర్వించే స్థాయిలో ఎన్టీఆర్ ఉన్నాడు అనడంలో సందేహం లేదు. భవిష్యత్తులో కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా కూడా గర్వించే విధంగా నందమూరి ఫ్యాన్స్ అంతా కూడా గల్లా ఎగరేసుకునే విధంగా ఎన్టీఆర్ సినిమాలు ఉంటాయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.