Balakrishna : బాలకృష్ణ నట వారసుడి తెరంగేట్రం.. మళ్లీ ఫ్యాన్స్‌ లో అదే లొల్లి

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: August 20, 2022, 8:40 pm

Balakrishna : నందమూరి ఫ్యామిలీ నుండి ఇప్పటికే పలువురు హీరోలు టాలీవుడ్ లో ఉన్నారు. మరో నందమూరి హీరో కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నాడు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు అంటూ దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుండి ఇండస్ట్రీ వర్గాల్లో మరియు నందమూరి అభిమానుల్లో చర్చ జరుగుతోంది. ఆ మధ్య బాలకృష్ణ కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్వయంగా తన కొడుకుని సినిమాల్లో ఎంట్రీ ఇప్పియ్యబోతున్నట్లుగా ప్రకటించాడు….

Balakrishna : మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ తప్పకుండా భారీ సినిమా అవుతుంది అంటూ బాలకృష్ణ ఆ సమయంలో పేర్కొన్నాడు, కానీ మోక్షజ్ఞ మాత్రం సినిమాల్లో హీరోగా నటించే ఆసక్తి లేని వాడిలా కనిపిస్తున్నాడు. ఇప్పటికి కూడా భారీ శరీరంతో ఏమాత్రం లావు తగ్గకుండా కనిపిస్తున్నాడు. వచ్చే ఏడాది మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఉంటుందంటూ ఇటీవల నందమూరి కుటుంబ సన్నిహితులతో బాలకృష్ణ చెప్పుకొచ్చాడట. కానీ బాలకృష్ణ ఇప్పటికీ కూడా తన కొడుకు ఎవరి దర్శకత్వంలో ఎంట్రీ ఇస్తాడు అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.

nandamuri balakrishna son mokshagna entry coming soon

nandamuri balakrishna son mokshagna entry coming soon

మరోవైపు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఫిజిక్ విషయంలో నందమూరి అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.హీరోలకు ఉండాల్సిన నాజూకైనా ఫిజిక్ మోక్షజ్ఞ కి ఏమాత్రం లేదు, అందుకే ఆయన హీరోగా సెట్ అవ్వకపోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్‌ కూడా చాలా బరువు ఉండేవాడు కాని సినిమా ల్లో ఎంట్రీ ఇచ్చే సమయంకు చాలా సన్నగా అయ్యాడు. మోక్షజ్ఞ మరియు నందమూరి బాలకృష్ణ కలిసి ఒక సినిమా చేస్తారని ఆ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడో.. తండ్రితో కలిసి నటించేది ఎప్పుడో చూడాలి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp