Amigos Movie : గతేడాది ‘ బింబిసార ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అంతే కాదు కళ్యాణ్‌రామ్ కెరీర్‌లోనే రు. 40 కోట్లకు పైగా షేర్ రాబట్టి తిరుగులేని కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ హిట్ ట్రాక్‌ను కళ్యాణ్ తన తాజా సినిమా అమిగోస్‌తోనూ కంటిన్యూ చేశాడు. ఈరోజు విడుదలైన ఈ సినిమా అదిరిపోయే టాక్ ను సంపాదించుకుంది. నాలుగు నెలల గ్యాప్‌లో కళ్యాణ్ రెండో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాకు ముందు నుంచి అన్నీ కలిసి వచ్చాయి.
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ లో నటించారు. ఓ పాత్రలో నెగటివ్ గా కనిపించి అదరగొట్టేశాడు. ఇక ఈ సినిమాను మైత్రి బ్యానర్ లో నిర్మించారు. ముందే ప్రి రిలీజ్ బిజినెస్ కంప్లీట్ అవ్వడం, అడ్వాన్స్ బుకింగ్‌లు బాగుండడం ఇవన్నీ ఈ సినిమాకు చాలా కలిసొచ్చాయి. మైత్రి బ్యానర్ లో సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా ఈ బ్యానర్ లో రావడం కొంత ప్లస్ అయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకోవడంతో కళ్యాణ్ రామ్ స్క్రిప్ట్ సెలక్షన్ మరోసారి అదిరింది అని అంటున్నారు.
అమిగోస్ సినిమా థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కింది. తెలుగు ప్రేక్షకులకు ఇది భిన్నమైన అనుభవం అని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. ఇక డైరెక్టర్ రాజేంద్రరెడ్డి ట్రిపుల్ రోల్ క్యారెక్టర్స్ ను ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చేశాడని జనాలు అంటున్నారు. ముఖ్యంగా బిపిన్ రాయ్ క్యారెక్టరైజేషన్ ఎంతో స్పెషల్ గా నిలిచింది. కళ్యాణ్ ఆ పాత్రను చాలా పర్ఫెక్ట్ గా చేశారు. ఏదేమైనా ప్రస్తుతం ఇండస్ట్రీలో నందమూరి హీరోలు వరుసగా హిట్లు కొడుతున్నారు. బాలయ్య అఖండ వీరసింహారెడ్డి సినిమాలతో, తారక్ రామ్ వరుసగా ఆరు హిట్లు, కళ్యాణ్ రామ్ బింబిసార, అమిగోస్ సినిమాతో సూపర్ హిట్లు కొట్టారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.